Tdp is my blood says jr ntr

junior ntr, tdp party, tdp campain, elections 2014, ntr fans, balakrishna, harikrishna,

tdp is my blood says jr ntr

ఎన్నికల్లో పోటీ చేయను: ఎన్ టి ఆర్

Posted: 01/18/2014 07:25 AM IST
Tdp is my blood says jr ntr

రాబోయే ఎన్నికల్లో జూనియర్ ఎన్ టిఆర్ పోటీ చేస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. తాను రాబోయే ఎన్నికల్లో పోటే చేయబోవడం లేదని, అయితే తెలుగుదే:శం తరపున ప్రచారం చేయడాన్ని బాధ్యతగా భావిస్తానన్నారు. తెలుగుదే:శం పార్టీ తన రక్తంలో భాగమని దానిని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్ టిఆర్ 18వ వర్థంతి సందర్భంగా  జూనియర్ ఎన్ టిఆర్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

జూనియర్ ఎన్ టిఆర్ చేసిన ఈప్రకటనతో అభిమానులు నీరుగారిపోయారు.  ఈ సారి తమ హీరో ఎన్నికల్లో పోటీ చేస్తారని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్ టిఆర్ ప్రచారాన్ని నిర్వహిస్తానని చెప్పడాన్ని వారు హర్షిస్తున్నారు.

మరి జూనియర్  ఎన్ టిఆర్ తండ్రి ఈ సారి జరిగే ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషిస్తారో నని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. హరిక్రిష్ణ , బాలక్రిష్ణ లు కూడా పార్టీలో కీలకంగా వ్యవహరస్తే  పార్టీకి తిరిగి జవసత్వాలు  వచ్చి తిరిగి గాడిలో పడుతుందని వారు సూచిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles