T bill digvijay talks with ap cong leaders

state bifurcation bill,telanagana, Telangana bill,Digvijay Singh,Digvijay talks with AP Cong leaders,Telangana,Seemandhra,Congress, plz add t bill, ap political news, ap politics, latest news, breaking news, headlines, flash news, andhra headlines, cm kiran

AICC General Secretary Digvijay Singh, in-charge of Congress affairs in the state, held hectic parleys with party leaders from Telangana and Seemandhra here on Thursday.

డిగ్గీరాజా గడువు వారం రోజులే

Posted: 12/13/2013 08:41 AM IST
T bill digvijay talks with ap cong leaders

తెలంగాణ ఇవ్వడం అంటే దోసె వేసినంత ఈజీ కాదనీ, నెల రోజుల గడువు అంటే ముప్పై రోజులు మాత్రమే కాదని చెప్పిన కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు, ఇప్పుడు నలభై రోజులంటే అన్ని కాదని, పది రోజులే అంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన అంశానికి సింబందించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ బిల్లు పై చర్చించడానికి రాష్ట్రపతి నలభై రోజుల గడువు ఇచ్చారు. రాష్ట్రానికి బిల్లు వచ్చిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ నిన్న రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో, సీమాంధ్ర నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా దిగ్విజయ్ సింగ్ వారం రోజులలోతెలంగాణ బిల్లు వెనక్కి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ కు, కాంగ్రెస్ సీమాంద్ర నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

‘రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. విభజన బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఈ సమయంలో అనవసర రాద్ధాంతం చేయకుండా సహకరించండి. సుహృద్భావ వాతావరణంలో అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తం చేసి కేంద్రానికి పంపండి. ’

ఇంకా బిల్లును అడ్డుకోవాలనుకోవడం ఏమాత్రం మంచిది కాదని, విభజన బిల్లుపై అభిప్రాయ సేకరణ ప్రక్రియ అసెంబ్లీలో సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కిరణ్‌తో దిగ్విజయ్ ఏకాంత చర్చలు జరిపి, బిల్లును వెంటనే అసెంబ్లీలో చర్చించి పార్లమెంట్‌కు పంపాలని సూచించారు.

ఒకవేళ అలా చేస్తే తమకు రాజకీయంగా ఇబ్బందులొస్తాయని, కొద్ది రోజులు వేచి చూసిన తరువాత అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని భావిస్తున్నట్టు చెబితే దిగ్విజయ్ వినలేదని సమాచారం. వారం రోజుల్లో వెనక్కి పంపే దానికి రాష్ట్రానికి పంపడం దేనిని అని సీమాంధ్ర నేతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles