Kotla surya prakash reddy rejected cm offer

Kotla surya prakash reddy rejected CM offer, Union minister, kotla surya prakesh reddy, Congress high command, CM Post

Kotla surya prakash reddy rejected CM offer, Union minister, kotla surya prakesh reddy, Congress high command, CM Post

సీఎం పదవా... నాకు వద్దండీ...?

Posted: 11/09/2013 09:11 AM IST
Kotla surya prakash reddy rejected cm offer

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రాజకీయ నాయకులకు రాత్రికి రాత్రే బంపర్ ఆఫర్ తగలవచ్చు. అలాంటిదే జరిగింది కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి. కాంగ్రెస్ అధిష్టానం గత కొన్ని రోజుల నుండి ముఖ్యమంత్రి కిరణ్ ను మార్చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దానికి తగినట్లుగానే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా కోట్లకు ఈరోజు అప్పాయింట్ మెంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

అలాగే దిగ్విజయ్ సింగ్ కూడా కోట్లకు ప్రత్యేకంగా విందు ఇవ్వడంతో దీనికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చిన అవకాశాన్ని మాత్రం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సద్వినియోగం చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదనే వార్తలు వినిపిస్తున్నారు. అధిష్టానం ఓపెన్ ఆఫర్ ఇస్తే దాన్ని తిరస్కరించారు. సమైక్యభావన బలంగా ఉన్న సమయంలో సమైక్యవాది ముఖ్యమంత్రిని మార్చి తనను సి.ఎమ్. చేస్తే లేనిపోని ఇబ్బందులు పడవలసి వస్తుందని, మూడు నెలలకాలానికి ముఖ్యమంత్రి పదవి చేపడితే వచ్చే లాభం కూడా ఉండదని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది.

మరి కోట్ల వచ్చేసారి కాంగ్రెస్ అధికారంలోకి ఎటూ రాదు కాబట్టి తీసుకున్నా ప్రయోజనం ఉందని భావించి ఉంటారేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles