Balakrishna injured in legend shooting

balakrishna injured in legend shooting, Balakrishna with minor injuries, Nandamuri Balakrishna, Boyapati Sreenu, Legend movie shooting in vizak,

balakrishna injured in legend shooting, Balakrishna with minor injuries

హీరో బాలకృష్ణకు గాయాలు

Posted: 11/06/2013 12:40 PM IST
Balakrishna injured in legend shooting

నటుడు నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘సింహ ’ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో.. బాలకృష్ణ మరో అవకాశం బోయపాటి ఇవ్వటం జరిగిందని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు ‘లెజెండ్ ’ చిత్ర షూటింగ్ విశాఖ జిల్లాలో జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న షూటింగులో బాలకృష్ణ గాయపడ్డారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.

 

సింహాచలంలో జరుగుతున్న 'లెజెండ్' చిత్ర షూటింగ్ లో భాగంగా ఈరోజు ఉదయం ఆయన మోచేతికి స్వల్పంగా గాయం అయినట్లు సమాచారం. దాంతో బాలకృష్ణను విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

 

కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణని పవర్ ఫుల్ గా చూపించనున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు ఖంగారుపడ్డారు. తరువాత అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles