Im planning suicide attack on modi at patna rally

Suicide attacks, Narendra Modi, Indian Mujahideen, terrorists, atna rally, narendra modi, indian mujahideen, indian mujahideen plan attack on narendra modi, hunkar rally

ndian Mujahideen (IM) operatives reportedly wanted to carry out a suicide attack on Narendra Modi at Hunkar rally in Patna on October 27 but the plan went wrong due to accidental blasts.

హూంకార్ ర్యాలీ టార్గెట్ మోడీనే ?

Posted: 10/31/2013 08:39 AM IST
Im planning suicide attack on modi at patna rally

భాజాపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి ఆయన్ను మట్టుపెట్టేలా పథకం పన్నారని, కానీ వారి పథకం ఫెయిల్ కావడంతో మోడీ బతికి బయటపడ్డాడని ఈ నెల 27న మోడీ నిర్వహించిన హుంకార్ ర్యాలీ సందర్భంగా పేళుళ్ళలో పట్టుబడ్డ ఉగ్రవాది ఇంతియాజ్ అన్సారీ విచారణలో అంగీకరించినట్లు ఇండియా టుడే వెల్లడించించింది.

మోడీ హత్యకు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పథకం సిద్ధం చేశారని, ‘మచిలీ-5’ కోడ్ పేరుతో ఆత్మాహుతి దాడికి పాట్నా రైల్వేస్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో బాంబును సిద్ధం చేస్తుండగా, టైమర్, బ్యాటరీ అమర్చక ముందే అది అనుకోకుండా పేలిపోవడంతో కథ అడ్డం తిరిగిందని విచారణలో చెప్పినట్లు సమాచారం. పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూడటంతో భాజాపా నేతలు ఖంగుతిన్నారు.

గతంలో కూడా భారత ప్రధాని రాజీవ్ గాంధీని కూడా ఆత్మాహుతి దాడికి పాల్పడి చంపేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పేళుళ్ళలో గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మోడీ రేపు పాట్నా రానున్నారు. దీంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles