Anam jaya kumar reddy fire on anam brothers

anam jaya kumar reddy fire on anam brothers, Anam Jayakumar Reddy comments on brothers, Samaikyavadis fires on Anam, anam Ramanarayana Reddy, minister Anam, anam Ramanarayana Reddy, anam vivekananda reddy, mla anam vivekananda reddy

anam jaya kumar reddy fire on anam brothers, Anam Jayakumar Reddy comments on brothers

సీఎం కావాలనే ఆశతోనే విభజనకు మద్దతు..

Posted: 10/04/2013 03:12 PM IST
Anam jaya kumar reddy fire on anam brothers

నెల్లూరు రాజకీయ బ్రదర్స్ అంటే తెలియని వారు ఎవరు ఉండారు. రాజకీయ బ్రదర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆనం బ్రదర్స్. ఆనం రాంనారాయణరెడ్డి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా, ఆనం వివేకనంద రెడ్డి ఎమ్మెల్యేలుగా నెల్లూరు రాజకీయాలను నడుపుతున్నారు. ఇప్పటి వరకు ఆనం బ్రదర్స్ అంటే.. ఇద్దరే అనే విషయం మాత్రమే తెలుసు. కానీ ఆనం బ్రదర్స్ ముగ్గురు అనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. సమైక్యాంద్ర కోసం ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో.. ఆనం రాంనారాయణ రెడ్డి సోదరుడు.. మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్ రెడ్డి తెరపైకి వచ్చారు.

 

తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం ఆనం బ్రదర్స్ స్టైల్. కానీ ఈరోజు జయకుమార్ రెడ్డి, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వివేకనందర రెడ్డిల ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి ఆశించి గత మూడు రోజులుగా సేవ్ ఆంద్రప్రదేశ్ , సేవ్ కాంగ్రెస్ పార్టీ అంటూ కుటుంబానికే మచ్చతెచ్చావంటూ.. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పై ఆనం జయకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దశాబ్ధాలుగా పెద్దలు సంపాదించిన పేరుప్రతిష్ఠలను దిగజార్చి సీమాంద్ర ప్రజలను మోసం చేస్తున్నారని . ఆనం జయకుమార్ రెడ్డి మండిపడ్డారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామనిచెప్పటంతో.. సీమాంద్ర ప్రాంత ప్రజల మనోభావాలుదెబ్బతిన్నాయన్నారు. ముఖ్యమంత్రికావాలనే పదవీకాంక్షతోనే విభజనకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు వత్తాసూ పలికితే.. మరణించిన తమ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని ఆనం జయకుమార్ రెడ్డి అన్నారు. తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని ఆనం బ్రదర్స్ కు ఆనం జయకుమార్ రెడ్డి సూచించారు. ఇది మన తండ్రిగారి బెదిరింపు అనుకుంటారో, లేక నా బెదిరింపు అనుకుంటారో, సీమాంద్ర ప్రజల బెదిరింపు అనుకుంటారో మీ ఇష్టం అని ఆనం జయకుమార్ రెడ్డి అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles