Naidu talks to media on cabinet decision

Naidu talks to Media on Cabinet Decision, telangana announcement, shinde announced telangana state, telangana state announcement, telangana peoples celebrations, ashok babu on telangana state announc

Naidu talks to Media on Cabinet Decision, telangana announcement, shinde announced telangana state, telangana state announcement, telangana peoples celebrations, ashok babu on telangana state announc

రెండు ప్రాంతాలకు న్యాయం చేయమన్నా వినలేదు

Posted: 10/04/2013 11:04 AM IST
Naidu talks to media on cabinet decision

కేంద్ర కేబినెట్ ‘తెలంగాణ నోట్ ’ కు ఆమోదం తెలిపిన తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా నిర్ణయం తీసుకుందని, ఇంత దుర్మార్గంగా చేస్తుందని నేను అనుకోలేదని, రెండు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా ఇరుప్రాంతాల వారిని కూర్చోబెట్టి సమస్యల పరిష్కారం చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాని తాను పదే పదే చెప్పినా, ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రతిపక్ష నేతల్ని కలిసి చెప్పినా మా మాటను లెక్కచేయకుండా నిర్ణయం తీసుకోవడం చాలా బాధ అనిపించిందని బాబు అన్నారు. గత రెండు నెలలకు పైగా సీమాంధ్ర ప్రజలు రోడ్ల పైకి వచ్చిన తమ ఆవేదనను చెబుతున్నా కాంగ్రెస్ తన స్వార్థ ఓటు రాజకీయాల కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.

తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని, విభజన తరువాత తలెత్తే సమస్యలకు కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించామని అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆర్టికిల్ 3 ప్రకారం రాష్ట్రం ఇవ్వాలని అందని ఆయన చెప్పారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లు సహకరిస్తారని ఇలా చేశారని అన్నారు.రెండు ప్రాంతాలలో రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందని అన్నారు.కాంగ్రెస్ నేతలే తీవ్రంగా విమర్శిస్తుంటే ఆ పార్టీ నాయకత్వం ఎలా సమర్దించుకుంటుందని అన్నారు. ఈ విభజన నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే మరో రెండు రోజుల్లో తీవ్రమైన కఠిన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. అయినా మొన్నటి వరకు రెండు కళ్ల సిద్దాంతం అంటూ పబ్బం గడుపుకు వచ్చిన బాబు ఇప్పుడు ఒక్క ప్రాంతానికే వత్తాసు పలకం ఏంటని తెలంగాణ ప్రాంత నేతలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles