Ap ngos save andhra meet tjac bandh

High tension, Hyderabad,APNGO Meeting,Telangana Bandh, AP NGOs Save Andhra Meet, TJAC Bandh

hitension in hyderabad city due to apngo meeting and telangana bandh.

నగరంలో టెన్షన్ - టెన్షన్

Posted: 09/07/2013 08:29 AM IST
Ap ngos save andhra meet tjac bandh

గత రెండు మూడు రోజుల నుండి పోటాపోటీగా నువ్వానేనా అంటూ ఇటు తెలంగాణ వాదులు, అటు సమైక్య వాదులు ఏ మాత్రం బెట్టుదిగకుండా సభను నిర్వహించడానికి సీమాంధ్రులు సిద్ధం అయితే, మరో వైపు తెలంగాణ వాదులు సభను అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ‘సేవ్ ఆంధ్ర పదేశ్ సభ’ అటు తెలంగాణ బంద్ తో రాష్ట్ర రాజధానిలో నేడు ఏం జరగబోతుందోనని సర్వత్రా భయం నెలకొంది. ఇక సమైక్యవాదులు సభను ఎలాగైనా నిర్వహించి తీరుతామని అంటే.... మరో వైపు తెలంగాణ వాదులు సభను అడ్డుకుంటామని ప్రకటించారు. సభకు ముందే సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మరింత హైటెన్షన్ నెలకొంది. సమైక్య సభ కోసం సీమాంధ్ర జిల్లాల నుండి భారీగా ఉద్యోగులు బస్సుల్లో, రైళ్లలో భారీగా రాజధానికి తరలివస్తున్నారు. నిన్న జరిగిన పరిణామాలతో ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీమాంధ్రులు వస్తున్న బస్సుల పై తెలంగాణ వాదులు ఏ క్షణమైనా దాడి చేయవచ్చనే ఉధ్దేశ్యంతో విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్‌లు, రహదారులపై మొబైల్ పార్టీలతో నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్లలో కూడా బందోబస్తు పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంత ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఇక తెలంగాణలో హైదారాబాద్ తో సహా అన్ని జిల్లాల్లో బంద్ కొనసాగుతుండటంతో జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటు నగరంలో ఎంఎంటీఎస్ రైళ్ళను కూడా నిలిపివేశారు. రాజధానిలోని పరిస్థితిని డీజీపీ, నగర కమీషనర్ లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఎలా గడవబోతుందోనని నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles