Shinde and azad congratulated kiran kumar reddy

Chalo Assembly, N Kiran Kumar Reddy, Home minister Sushilkumar Shinde, Gulam Nabi Azad, Union ministers

Union ministers Sushil Kumar Shinde and Gulam Nabi Azad congratulated Chief Minister N Kiran Kumar Reddy and State Government for maintenance of law and order during chalo assembly agitation.

కిరణ్ కు కేంద్రం ప్రశంసలు

Posted: 06/15/2013 09:34 AM IST
Shinde and azad congratulated kiran kumar reddy

తెలంగాణ జేఏసీ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంలో సఫలం అయినందుకు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నందుకు రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ నుండి ప్రశంసలు అందుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అలజడి, అశాంతి, విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాలు రచించినా శాంతి భద్రతలను కాపాడారు' అని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో సమర్ధంగా శాంతి భద్రతలను పరిరక్షించారని వారు ప్రశంసిచిన విషయం స్వయంగా సి.ఎమ్. ఆఫీస్ తెలియచేసింది. కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయ, సహకారాల వల్లే శాంతి భధ్రతలను కాపాడగలిగామని కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఉద్రిక్తతను సృష్టించినప్పటికీ ప్రశాంతంగా ముగియడంపై కాంగ్రెస్ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని కిరణ్ అడ్డుకోవడంలో సఫలం అయ్యాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles