Sachin tendulkar announces ipl retirement

master blaster sachin tendulka, indian premier league, ipl, ipl match, rahul dravid, spot fixing,

Sachin Tendulkar announces IPL retirement

బాబోయ్ ఇక నమస్కారం

Posted: 05/27/2013 01:16 PM IST
Sachin tendulkar announces ipl retirement

ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ద్రావిడ్ తన మనసులోని మాటను బయట పెట్టారు. ఐపీఎల్ అంటేనే ఇక విరక్తి పుట్టిందని, ఇక నుండి ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉండానని, ఈ స్పాట్ ఫిక్సింగ్ తో క్రికెట్ పరువు పోయిందని ఆవేదన పడ్డారు. ఇప్పుడు బాటలో మరి కొంత మంది సీనియర్లు ఐపీఎల్ దూరంగా ఉండటానికి సిద్దమవుతున్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలోచూస్తున్న ప్రేక్షకులకే కాకుండా ఆడుతున్నక్రికెటర్లకు కూడా మోజు తగ్గిపోయింది.

పలువురు సీనియర్లు వచ్చే ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి కనబరచడంలేదు. రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ ద్రావిడ్, ముంబై ఇండియాన్స్ జట్టు సభ్యుడు సీనియర్ క్రికెటర్ సచిన్ వచ్చే ఐపీఎల్ ఆడబోమని ప్రకటించేశారు. అదే బాటలో మరి కొందరు విదేశీ, స్వదేశీ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. దీనితో వచ్చేఏడాది ఐపీఎల్ ఉంటుందా.? ఉండదా.? లేక స్టార్లు లేని మ్యాచులు జరుగుతాయా అన్నది అనుమానాలు . వ్యక్తమవుతున్నాయి. ఈ స్పాట్ ఫిక్సింగ్ తో ప్రతి ఒక్క క్రికెటర్ పై అందరు అనుమాన చూపులతో చంపేస్తున్నారని సీనియర్ ఆటగాళ్లు అంటున్నారు. అందుకే రాబోయే ఐపిఎల్ కు చాలా దూరంగా ఉంటామని సీనియర్లు చెబుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles