Woman legs were cut for silver ornaments

silver ornaments, gold rates high, woman legs cut, hyderabad outskirts, kokapeta

woman legs were cut for silver ornaments

వెండి కడియాల కోసం యువతి కాళ్ళు నరికారు

Posted: 04/16/2013 08:50 AM IST
Woman legs were cut for silver ornaments

హైద్రాబాద్ నగర శివార్లలో అఘాయిత్యాలు రాను రాను మరీ హద్దు మీరిపోతున్నాయి.  కోకాపేట ప్రాంతంలో పాత సామాన్ల వ్యాపరం చేసే శంకరమ్మ అనే యువతి కాళ్ళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికివేసారు. 

ఈ దుర్మార్గానికి కారణం ఆమె కాళ్ళకి తొడుక్కున్న వెండి కడియాలు.  వెండి కడియాల కోసం కాళ్ళు నరికి పారిపోయిన ఆ దుండగులు ఆమెకు బాగా తెలిసినవాళ్ళే అయ్యుండొచ్చు అని పోలీసులు భావిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

విపరీతంగా పెరిగి పోయి వెండి బంగారు నగల ధర ఒక కారణమైతే, మంటగలిసి పోతున్న మానవతా విలువలు, అంతరించిపోతున్న మానవత్వమే అసలు కారణమని, నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు అంటున్నారు. 

కాళ్ళు నరికివేయటం వలన జరిగిన అదుపు లేని రక్తస్రావం వలన శంకరమ్మ మరణించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles