Ram charan tej birthday celebrated in his absence

Ram charan tej, chiranjeevi, allu aravind, chiranjeevi blood bank, rem charan birthday, janjeer hindi movies, toofan telugu movie

ram charan tej birthday celebrated in his absence

ram-charan.png

Posted: 03/28/2013 08:48 AM IST
Ram charan tej birthday celebrated in his absence

ram-charan-cake

నిన్న రామ్ చరణ్ జన్మదినం.  కానీ అతని అభిమానులకు, దగ్గర సంబంధీకులకు ఆయన అందుబాటులో లేరు.  విదేశాలలో ఉన్న రామ్ చరణ్ జన్మదిన వేడుకలను స్వదేశంలో హైద్రాబాద్ బంజారా హిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అతి వైభవంగా నిర్వహించారు.  రామ్ చరణ్ ఇక్కడ లేకపోయినా విదేశాల నుంచి సైతం ఈ వేడుకలో పాలు పంచుకోవటానికి అభిమానులు వచ్చారంటే అది వాళ్ళకి మెగా స్టార్ కుటుంబం మీదున్న అభిమానానికి నిదర్శనం.  

50 కేజీల కేక్ మీద రామ్ చరణ్ చిత్రంతో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అల్లు అరవింద్ పూర్తి చేసారు.  ఈ సందర్భంగా 650 మంది అభిమానులు రక్తదానాలు చేసారు.  హైద్రాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో ముఖ్య పట్టణాల నుంచి కూడా మొత్తం 66 కేంద్రాలనుంచి దాతలు చేసిన రక్త దానం 26 వేల యూనిట్లని చిరంజీవి తన ప్రసంగంలో తెలియజేసారు.  

రామ్ చరణ్ సరికొత్త తెలుగు చిత్రం తుపాన్ ట్రైలర్ కి అద్బుతమైన స్పందన వచ్చిందని, ఎంతో మంది ఫోన్లలో కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నారని చిరంజీవి అన్నారు.  దానితో పాటు హిందీలో వస్తున్న రామ్ చరణ్ ఐదవ చిత్రం జంజీర్ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేసారు.

 రామ్ చరణ్ ఆ పార్టీలో లేకపోయినా, అభిమానులంతా చిరంజీవిలో అతన్ని చూసుకుంటూ, చిరంజీవి మాటలతోనే సంతృప్తి పడ్డారు.  అభిమానమనేది ఉండేది గుండెల్లో కానీ కంటి తెర మీద అభిమాని బొమ్మ పడ్డప్పుడే కాదు కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attacked new zealand cricketer jesse ryder in coma
Bsp leader bhardwaj murder clues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles