Public grievances on sadak bund planned by t

sadak bund, telangana agitation, high court of Andhra pradesh

public grievances on sadak bund planned by t

sadak-bund.png

Posted: 02/21/2013 05:24 PM IST
Public grievances on sadak bund planned by t

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఈ నెల 24న చేపట్టనున్న సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించటానికి ఈ రోజు ఉదయం సమావేశమైన తెలంగాణా ఐకాస 12 కేంద్రాలను గుర్తించారు.  ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగటం కోసం ఐకాస ఇంకా తెరాస, భాజపా లతో చర్చించటం మిగిలివుంది.  అలాగే ప్రతి జిల్లాలోనూ ఉన్న ఐకాస కు నిర్వహణ బాధ్యతలను అప్పగించి సక్రమంగా జరిగేట్టు చూడనున్నారు.

అందరూ తమ తమ ప్రయాణాలను వాయిదా వేసుకోమని, సడక్ బంద్ ని విజయవంతం చెయ్యమని ఇప్పటికే ప్రజలందరికీ విఙప్తి చేసారు.  అంతే కాకుండా దీన్ని అడ్డుకుంటే మరి అంతే సంగతులు అంటూ ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు చేసారు. 

ఇదిలా ఉండగా కర్నూల్ కి చెందిన న్యాయవాది బి.వి.శ్రీనివాసులు, ఈ సడక్ బంద్ వలన రాకపోకలకు, అంబులెన్స్ లాంటి అత్యవసర సేవలకు విఘాతం కలుగుతుందని, ప్రజలు విపరీతంగా ఇబ్బందులకు గురౌతారని అభ్యంతరాలు తెలుపుతూ, ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణా ఐకసను కూడా పేర్కొంటూ ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kadapa dccb elections postponed to 28th
Road workers crushed to death by vehicle  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles