103 killed over 270 injured in pakistan terror attacks

pakistan terror attacks bomb blasts, pakistan bomb blast, balochistan, khyber-pakhtunkhwa, pakistani security forces

103 killed, over 270 injured in Pakistan terror attacks

Pakistan terror attacks.gif

Posted: 01/11/2013 12:29 PM IST
103 killed over 270 injured in pakistan terror attacks

103 killed, over 270 injured in Pakistan terror attacks

పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. బలుచిస్తాన్, ఖైబర్ - పక్తుంఖ్యా ప్రాంతాల్లో వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. షియా ముస్లింలు లక్ష్యంగా బాంబు దాడులు చేసినట్లు సమాచారం. ఈ బాంబు దాడుల్లో 103 మంది దుర్మరణం చెందారు. 270 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లు జరిగిన చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లష్కర్ ఇ జంగ్వీ అనే ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు బాధ్యత ప్రకటించినట్లు తెలుస్తోంది.  బలూచిస్థాన్  రాజదాని  క్వెట్టాలో భద్రతా సిబ్బంది, షియా  వర్గం  లక్ష్యంగా  దాడులు  జరిగాయి.  అలందార్ రోడ్, ఎయిర్ పోర్టు  రోడ్ లో  జరిగిన  దాడుల్లో  69 మంది  మరణించారు.  మరో 160 మంది గాయపడ్డారు.  అలందార్ రోడ్ లో  షియా  ప్రార్థన  మందిరాలు  ఉన్న  ఓ స్నూకర్ క్లబ్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి  దాడికి  పాల్పడ్డారు. 

103 killed, over 270 injured in Pakistan terror attacks

ఆనంతరం కొద్ది నిమిషాల  వ్యవదిలోనే మూడు బాంబు  పేలుళ్లు  చోటుచేసుకున్నాయి.  క్వెట్టాలో  రద్దీగా  ఉండే  బచాఖాన్  చౌక్ లో  భద్రతా సిబ్బంది లక్ష్యంగా  జరిగిన  దాడుల్లో  12 మంది  మరణించారు.   మరో 40 మంది గాయపడ్డారు.  ఈ దాడుల్లో  20 కేజీల  పేలుడు  పదార్ధాలను  దుండగులు  ఉపయోగించినట్లు  పోలీసులు తెలిపారు.  ఖైబర్ –పంక్తుంఖ్వాలోని స్వాత్ లోయ ప్రాంతం  మింగోరా  సమీపంలో  జరిగిన  భారీ పేలుడులో 22 మంది చనిపోగా .. మరో 70 మంది గాయపడ్డారు.  అయితే ఈ పేలుళ్లకు ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandra venkataramana reddy comments on chandrababu naidu
Vasantha gold company cheated public for 25 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles