Tdp nannapaneni mahadwara dispute

nannapaneni rajakumari, tirupati, pranab mukherjee, tirumala

Telugudesam Party senior leader and MLC Nannapaneni Rajakumari has entered from Mahadwara on Sunday

TDP nannapaneni mahadwara dispute.png

Posted: 12/30/2012 03:25 PM IST
Tdp nannapaneni mahadwara dispute

nannapaneniనిత్య వివాదాలతో నిత్యం వార్తలో ఉండే టీటీడీ వారికి టీడిపి నన్నపనేని రాజకుమారి మరో వివాదంలోకి లాగింది. తెలుగు దేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ అయిన నన్నపనేని రాజకుమారి తిరుమలలో జరిగిన తెలుగు సభలకు హాజరయ్యి, అనంతంరం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఈమె మహా ద్వార ప్రవేశం గుండా వెళ్ళి దర్శించుకున్నారు. ఇప్పుడు ఈమె మహాద్వారా దర్శనం పెద్ద వివాదం రేపుతుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు మహాద్వార ప్రవేశం ఉంటుంది. ఇతరులకు ఉండదు. ఇటీవల నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలు ప్రారంభించేందుకు తిరుపతి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో కేవలం ప్రణబ్‌ను మాత్రమే మహాద్వార ప్రవేశం అనుమతించారు. అలాంటిది నన్నపనేని మహాద్వార ప్రవేశం చేయడం పెద్ద దుమారాన్ని రేపుతుంది. అయితే ఇది ఖచ్చితంగా భధ్రతా వైఫల్యమే అని అంటున్నారు. దీని పై పలువురు మండి పడుతున్నారు. అసలే ఫైర్ బ్రాండ్ అయిన నన్నపనేని పై విమర్శలు వస్తున్నాయి... దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attempt murder rti activist
No separate telangana state till 2014 tg  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles