T jac chairman not attend all party meeting

Telangana Rashtra Samithi, K Chandrashekar Rao, oint Action Committee, Kodandaram, TRS, T-JAC

Telangana Rashtra Samithi (TRS) president K Chandrashekar Rao on Monday called upon Telangana Political Joint Action Committee (T-JAC) M Kodandaram to accompany him in the all-party

T-JAC chairman may not be attend all-party meeting.png

Posted: 12/19/2012 08:56 AM IST
T jac chairman not attend all party meeting

Kodandaramఈనెల 28వ తేదీన ఢిల్లీలో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి టీఆర్ఎస్ తరుపున కేసీఆర్, ఆయన వెంబడి జేఏసీ ఛైర్మెన్ కొదండరామ్ ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి కోదండరామ్ వెళ్ళే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈయనను కేసీఆర్ ఆహ్వానించడం జేఏసీలో ని రాజకీయ పార్టీలు అయిన బీజేపీ, సీపీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో జేఏసీ స్టీరింగ్ కమిటీ బుధవారం ఉదయం 9.30కు అత్యవసరంగా భేటీ కానుంది. ఈ భేటీలో మిగిలిన భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కోదండరాం తీసుకోనున్నారు. టీఆర్ఎస్ తరఫున కోదండరాం అఖిలపక్ష భేటీకి హాజరుకావటం బీజేపీ, న్యూడెమోక్రసీలకు ఆమోదయోగ్యం కాదని తెలుస్తోంది. ఇవే కాకుండా, మెజారిటీ భాగస్వామ్య సంఘాలు కూడా టీఆర్ఎస్ తరఫున కోదండరాం అఖిలపక్ష భేటీకి వెళ్లకుంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. గతంలో జరిగిన అఖిలపక్ష భేటీకి జయశంకర్ వెళ్ళారు. కానీ ఇప్పుడు కోదండరామ్ వ్యక్తిగా లేరు. జేఏసీకి ఛైర్మెన్. కాబట్టి అతను భేటీకి వెళ్ళక పోవడమే మంచిదనే అభిప్రాయం జేఏసీ వర్గాల నుండి బలంగా వినిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shinde calls meet with police cm to meet women groups
Konda surekha fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles