Cpi narayana comments on congress party

CPI Narayana comments on congress party

CPI Narayana comments on congress party

CPI Narayana comments on congress party.png

Posted: 08/30/2012 03:17 PM IST
Cpi narayana comments on congress party

CPI-Narayanaసీపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ మధ్యన  తన నోటికి ఉన్న దురదానందాన్ని బయట పెడుతున్నాడు. నిత్యం ఏదో ఒక వింత పని లేదా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడే నారాయణ తాజాగా కాంగ్రెస్ నాయకుల పై తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అయిన తెలంగాణ ప్రాంత ఎమ్మల్యేలు, ఎంపీలు చేతగాని దద్దమ్మలు అయిపోయారని, పార్లమెంటులో సోనియాని చూసి తల దాచుకుని, ఇక్కడకు వచ్చి జై తెలంగాణ, జై సమక్యాంధ్ర అంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చాసుపత్రుల్లో ఉండాల్సిన వాళ్లంతా కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో కప్పల్లా అరుస్తూ ఢిల్లీలో మాత్రం పిల్లుల్లా మూలుగుతారని విమర్శించారు. రొయ్యకులాగే వీరికీ మీసాలున్నాయి తప్ప రోషం మాత్రం లేదని ఎద్దేవ చేశారు."పార్లమెంటులో సోనియాను చూసి, తలలు బెంచీల కింద పెట్టుకునే మీరు మగాళ్లా?'' అని ఎద్దేవా చేశారు.
 
ఎంత రాజకీయ నాయకుడు అయినా, విపక్ష నేతగా ఉన్న సీపిఐ నారాయణ ఈ విధంగా మాట్లాడటం ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిండమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు . కాంగ్రెస్ నాయకులు అయితే నారాయణకు నోటి దురద ఎక్కువ కాబట్టే చాలా సార్లు అభాసు పాలవుతున్నాడు, అయినా ఆయనలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. అందుకే ఆయన మాట్లాడిన మాటలకు అర్థం లేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two helicopters crash midair in gujarat
Trisha not engaged to rana daggubati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles