Hugs for hire in new york

f you need a hug, one New York woman is for hire. Jackie Samuel opened up a business called The Snuggery a month ago.

f you need a hug, one New York woman is for hire. Jackie Samuel opened up a business called The Snuggery a month ago.

Hugs For Hire In New York.png

Posted: 07/31/2012 11:23 AM IST
Hugs for hire in new york

Hugsమనకు కిరాణం దుకాణాలు …... బట్టల దుకాణాలు … .. మందుల దుకాణాలు తెలుసు.... కానీ కౌగిలింతల దుకాణం ఎక్కడైనా చూశారా ? కౌగిలించుకోవడానికి  కూడా దుకాణాలు ఉన్నాయా ? దాని గురించి తెలుసుకోవాలంటే  ఈ స్టోరీ చదవి తీరాల్సిందే..

మనకు నచ్చిన అమ్మాయిని ఒక్కసారి గట్టిగా కౌగిలించుకోవాలని  ఉంటుంది. పార్కుల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో ఆని చేయాలంటే మనకు కొద్దిగా సిగ్గుగా ఉంటుంది. కానీ న్యూయార్క్ కి చెందిన ఓ అందాల సుందరి మాత్రం ఎవరినైనా కౌగిలించుకోవడానికి  సిద్దపడుంది. కాకపోతే.. గంటకు 40 డాలర్లు వసూలు చేస్తుంది! అదే మన కరెన్సీలో దాదాపు రూ.2,500! స్నేహితులు, ప్రేయసీ ప్రియుల మధ్యన అనివారమైన కౌగిలింతలు, సాన్నిహిత్యాన్ని కాస్తా ఈ అమ్మడు.. పక్కా వ్యాపారంగా మార్చేసింది.జాక్వెలిన్ శామ్యూల్ అనే యువతి గత నెలలో ఈ 'కౌగిలింత' దుకాణాన్ని ప్రారంభించేసింది. నాజూకైన ఈ సొగసరి.. తనతో ఏకాంతంగా గదిలో గడిపేందుకు 60 డాలర్లను తీసుకొంటుంది. ప్రైవేట్ రూమ్‌లో జరిగే ఈ 'సన్నిహిత' ఉపశమనంలో.. ఆమెతో కలిసి ముడుచుకొని పడుకోవడానికి, కౌగిలింతలతో మాట్లాడుకోవడానికి.. ఇంకా రకరకాల ముచ్చట్లాడేందుకు ఇబ్బందేం లేదు! 'ఎవరూ లేని ఏకాంతం.. ఉన్నది మేమిద్దరమే కదా!' అని.. 'అపరిచితుడు' ఎవరైనా ఉద్రేకపడితే కుదరదు. ఈ గది వెలుపల ఉన్న యువతి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో బడితెపూజ ఖాయమౌతుంది. జాక్విలిన్ సేవలు కోరి వచ్చే వారిలో ఎక్కువ మంది పురుషపుంగవులే!

"నాతో సహజంగా గడిపేందుకు అభ్యంతరం లేదు. కామం కోసం ప్రేరేపణ చేయడం మాత్రం నిషిద్ధం'' అని ఈ కౌగిళ్లరాణి తెలిపింది. "హత్తుకోవడం.. సెక్స్ కాదు. ఈ విషయమై సూటిగానే మాట్లాడతాను. ముడుచుకొని పడుకోవడం అంటే నాకెంతో ఇష్టం. అదెంతో బాగుంటుంది.'' అని పలికింది. 'సంకేత శాస్త్రాన్ని' అధ్యయనం చేసిన ఈ యువతి.. 'కౌగిలింత' సేవలు ప్రారంభించడానికి గల నేపథ్యాన్ని వివరించింది. "'స్పర్శ' ద్వారా ఉపశమనం, ఊరట పొందే అలవాటు అమెరికన్లలో అంతగా లేదు. కొన్ని నిమిషాలపాటు కౌగిలింత వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారన్న విశ్వాసంతోనే నేను ఈ వృత్తిని ప్రారంభించాను.'' అని వెల్లడించారు.. మరి మీకు కౌగిలించుకోవాలని  ఉంటే వెంటనే వెళ్లి ఉపశమనం పొందండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Binami liquor shops for botsa
One year jail for gudiwada mla kodali nani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles