Divorce hotel to help couples separate during two day stay

Divorce Hotel' to help couples separate during two-day stay

Divorce Hotel' to help couples separate during two-day stay

Divorce.gif

Posted: 06/08/2012 10:51 AM IST
Divorce hotel to help couples separate during two day stay

Divorce Hotel' to help couples separate during two-day stay

భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలంటే మన దగ్గర అదో పెద్ద తతంగం! పాశ్చాత్య దేశాల్లో అది చాలా ఈజీ. విడాకులు దొరకడమైతే సులభమేగానీ.. ఆస్తుల పంపకం, పిల్లల పెంపకం లాంటి సమస్యల్ని సాల్వ్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో.. నెదర్లాండ్స్‌కు చెందిన హాల్ఫెన్స్ అనే యువవ్యాపారవేత్తకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెడితే... డైవోర్స్ హోటల్ అవతరించింది. ఇంతకీ దీని ఉపయోగం ఏంటంటే... నెదర్లాండ్స్‌కు చెందిన భార్యాభర్తలెవరైనా విడాకులు తీసుకోవాలనుకుంటే ఈ హోటల్‌కు వస్తే చాలు. ఇరుపక్షాలకూ న్యాయవాదులను ఏర్పాటు చేస్తారు. మధ్యవర్తులతో మాట్లాడిస్తారు. పిల్లల పెంపకం, ఆస్తుల పంపకం, భరణం లాంటి అంశాలపై వివాదాలను ఒక కొలిక్కి తెస్తారు. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదిర్చి అందుకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలను సిద్ధం చేస్తారు. ఇదంతా రెండ్రోజుల్లో జరిగిపోతుందన్నమాట. ఇక, వాటిని కోర్టుకు సమర్పించి విడాకులు పొందడమే తరువాయి! విషయం ఇంత వివరంగా ఉన్నాక అక్కడి చట్టాల ప్రకారం ఏ న్యాయస్థానంలో అయినా రెండు వారాల్లోగా విడాకులు మంజూరయిపోతాయి.  ఇంతకీ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని హాల్ఫెన్స్‌ను అడిగితే.. తన స్నేహితుడు ఒకడు విడాకుల కోసం ప్రయత్నించి, న్యాయపరమైన వివాదాలతో ఐదు నెలల పాటు నానా ఇబ్బందులూ పడ్డాడని.. అదంతా చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతారు. హాల్ఫెన్స్ ఆలోచన ఇప్పుడు నెదర్లాండ్స్‌లో బాగా హిట్టయింది. "వీకెండ్‌లో రండి... విడాకులు పొందండి'' నినాదం విపరీతమైన ప్రాచుర్యం పొందింది. దీంతో.. హాల్ఫెన్స్ తన 'వ్యాపారాన్ని' ఇతరదేశాలకూ విస్తరించాలనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena saif wedding postponed
Bjp promises telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles