మొబైల్ హ్యాండ్సెట్లకు డిమాండ్‌కు సంబంధించి ఐసీఏ అంచనాలను మంత్రి ఆ సమాధానంలో వివరించారు. భారత్‌లో 2014లో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు పెరుగుతుందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) అంచనా వేస్తోంది. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ తెలిపిందని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్రా రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 20 కోట్ల మొబైళ్లకు (వీటి విలువ రూ.43,000 కోట్లు) డిమాండ్ ఉంటుంది. 2013లో ఈ డిమాండ్ 22.5 కోట్లకు(రూ.48,200 కోట్లు)కు పెరుగుతుంది. ఇక 2010లో హ్యాండ్సెట్లకు డిమాండ్ 15 కోట్లుగా(రూ.34,500 కోట్లు) ఉండగా, 2011లో ఈ డిమాండ్ 18 కోట్లకు(రూ.38,200 కోట్లు) పెరిగింది. కాగా గత ఏడాది కాలం నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ రెట్టింపు అయిందని స్టాట్‌కౌంటర్ గ్లోబల్ స్టాట్స్ నివేదిక తెలిపింది. గత ఏడాది 4.3 శాతంగా ఉన్న మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ఈ ఏడాది 8.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more