21 year old wants sex change surgery

sex-change operation,sex change surgery,Bombay HC

Bidhan, who prefers to call himself Swati, filed a petition on Wednesday alleging his family had stalled a scheduled sex-change operation on April 17 at Saifee Hospital by threatening the doctors.

21-year-old wants sex change surgery.GIF

Posted: 04/28/2012 02:09 PM IST
21 year old wants sex change surgery

21_years_old_menఅతను జన్మతహా మగవాడే. కానీ అతనికి 21 సంవత్సరాలు వచ్చేసరికి అతని వయస్సుతో పాటు మనస్సులో మార్పు వచ్చింది. నేను ఆడదాన్ని... కానీ ఎందుకో పురుష శరీరంలో చిక్కున్నాను అని బీధన్ బారువాలో ఓ గట్టి నమ్మకం బలపడింది. దీంతో అబ్బాయిగా ఉన్న అతను అమ్మాయిగా మారి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారు. దాని కోసం అతను పడరాని పాట్లు పడుతున్నాడు.

'నేను ఆడదాన్ని' అనే భావన బీధన్‌లో చాలా రోజుల నుండే మనస్సులో పాతుకపోవడంతో తన సమస్యకు లింగ మార్పిడి చికిత్సతో పరిష్కారం లభిస్తుందని తెలుసుకున్నారు. దానికి మూడు లక్షలు ఖర్చవుతుంది. వాటిని సమకూర్చుకొని మార్చి 2న సైకియాట్రిస్టును కలిశాడు. 'మహిళగా మారేందుకు అన్ని విధాలా అర్హుడివి' అని ఆ నిపుణుడు ద్రువీకరించారు. ఈనెల 17న ముంబైలోని సఫీ ఆస్పత్రిలో బీధన్‌కు ఆపరేషన్ జరగాల్సింది. కానీ... అది ఆగిపోయింది. కారణం... బీధన్ తల్లిదండ్రులే! "నేను మహిళగా మారడం మా అమ్మానాన్నలకు ఇష్టం లేదు. నన్ను తీవ్రంగా కొట్టేవారు. డాక్టర్లను కూడా బెదిరించారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే' అంటూ తల్లిదండ్రులపైనే బీధన్ ఇప్పుడు కోర్టుకెక్కారు. లింగమార్పిడి చేయించుకుంటే... తనను, తన 'బాయ్‌ఫ్రెండ్'ను చంపేస్తామని బెదిరించారంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 30కి విచారణ వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp bangaru laxman sentenced to 4 years
Pratibha patil gives up post retirement home in pune  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles