Adikeshavulu naidus son join in tdp

Adikeshavulu Naidus son join in TDP, Chandrababu naidu, Chittur Ex MP, DK adikeshavulu, son , srinivas, Congress party

Adikeshavulu Naidus son join in TDP

adikesavulu01.gif

Posted: 03/28/2012 06:24 PM IST
Adikeshavulu naidus son join in tdp

Adikeshavulu Naidus son  join in TDPరాయలసీమలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులను మళ్లీ తమవైపు ఆకర్షించాలన్న టీడీపీ నాయకత్వ ప్రయత్నం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు రాజకీయ ప్రముఖులు త్వ రలో టీడీపీలో చేరనున్నారు. టీటీడీ మాజీ చైర్మన్, చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవు లు నాయుడు కుమారుడు శ్రీనివాస్, చిత్తూరు నేత జంగాలపల్లి శ్రీనివాస్ ఆ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్‌లో కొంత కాలం క్రితం వరకూ క్రియాశీల పాత్ర పోషించిన ఆదికేశవులు నాయుడు ఇటీవల మౌనంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆ యన కుమారుడు టీడీపీలోకి వస్తున్నారు. తండ్రి ఆశీర్వాదంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెబుతున్నారు. జంగాలపల్లి శ్రీనివాస్ గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి పీ ఆర్పీ అభ్యర్థిగా పోటీచేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవా రం ఉదయం ఇక్కడ అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో సమావేశమైన చంద్రబాబు వీరి చేరికపై చర్చించారు. 'చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఒక సామాజికవర్గం ఓటర్లు కొందరు మన నుంచి దూరమయ్యారు. వారిని మళ్లీ మనం దరిచేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ వర్గానికి చెందిన నాయకులు మనవైపు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరందరూ ఆమోదిస్తే తీసుకొంటాను' అని చంద్రబాబు వారితో అన్నారు. డీకే కుమారుడిని తీసుకోవడం మంచిదేనని, జంగాలపల్లి శ్రీనివాస్‌ను తీసుకొనే ముందు చిత్తూరు నాయకులతో చర్చిస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకోవడం మంచి నిర్ణయమని, దీనివల్ల వచ్చే ఉప ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. డీకే కుమారుడిని వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worlds smallest dog might be in south carolina
Cbi is suspecting that ias officer srilakshmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles