Finance minister pranab mukharji ban the service tax for film industry

finance minister, pranab mukharji ,ban the service tax for film industry

finance minister pranab mukharji ban the service tax for film industry

28.gif

Posted: 03/16/2012 10:21 PM IST
Finance minister pranab mukharji ban the service tax for film industry

          pranab 2012-2013 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.  కేవలం వేతన జీవులకు తప్పించి అన్ని విభాగాల్లో పన్నును పెంచేస్తారని విశ్లేషకులు అనుకున్నారు. అయితే భారతీయులు విశేషంగా ప్రేమించే సినిమాకు ఈసారి ఆర్థిక మంత్రి వరమిచ్చారనే అనుకోవాలి. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సర్వీస్‌ టాక్స్ భారాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. 

          ఎప్పటి నుండో మన తెలుగు చిత్రసీమ పెద్దలు పన్ను ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు కోరారు. మన సినీ పెద్దల విజ్ఞప్తిని ప్రభుత్వం చూస్తామని మాట ఇచ్చినా ఇసుమంత కూడా కదలలేదు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ కడుతున్న పన్నును మినహాయిస్తున్నామని చేసిన ప్రకటనకు యావత్‌ సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.
            ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమ.  తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోషియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.యల్‌. శ్రీనాథ్‌ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎన్నో చిన్న సినిమాలు పుట్టుకొచ్చి పరిశ్రమ కళకళలాడుతుందని మన దర్శకనిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

           అంతేకాదు, ఉద్యోగులను ఊరిస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ప్రణబ్ బడ్జెట్‌లో ప్రస్తావించారు. పన్ను పరిమితిని 2 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ఆయన చెప్పారు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం పన్నును, పది ల క్షలకు పైగా ఆదాయానికి 30 శాతం పన్ను విధించేందుకు నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం 5 వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సేవింగ్స్ ఖాతాల్లోనూ రూ.10 వేల వడ్డీ వరకు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. కార్పొరేట్ టాక్స్‌ల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Master blaster sachin tendulkar says
Bangladesh beat inida in asia cup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles