Narayana apologizes to geeta reddy

Narayana apologizes to Geeta Reddy, cpi narayana, chiken narayana, Minister Geeta Reddy, Doctor Narayana, Delhi,

Narayana apologizes to Geeta Reddy

Narayana 02.gif

Posted: 03/08/2012 10:57 AM IST
Narayana apologizes to geeta reddy

CPI Narayana Apologize letter to Gita Reddy

మంత్రి గీతారెడ్డిని క్షమాపణ కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఓ లేఖ రాశారు. ఈ లేఖ జిరాక్స్ ప్రతులు అసెంబ్లీ లాబీలో మీడియాకు అందాయి. ఇటీవల చిన్న తరహా పరి శ్రమల యాజమాన్యాలు చేస్తున్న ధర్నాలో.. మంత్రి గీతారెడ్డిని ఉద్దేశిస్తూ.. ‘ఆమెకేం తెలుసు.. సింగారించుకోవడం తప్ప..!’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దళిత సంఘాలు నారాయణ తీరును నిరసిస్తూ.. ప్రకటనలు చేశారు. కొన్ని సంఘాలైతే.. ఏకంగా ఆయన ఇంటికే వెళ్లాయి. ఆ సమయంలో నారాయణ ఢిల్లీలో ఉండడంతో.. ఆ సంఘాలు వెనుదిరిగాయి. తాను చేసిన వ్యాఖ్యలపై నారాయణ మరుసటి రోజే క్షమాపణ చెప్పినా.. గీతారెడ్డి నుంచి సరైన ప్రతిస్పందన కన్పించలేదు. ఆ తర్వాత పార్టీ శాసనసభా పక్షనేత గుండా మల్లేశ్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడా వెంకటడ్డిని గీతారెడ్డి వద్దకు పంపించినా.. ఆమె నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు.

చివరికి నారాయణ గీతారెడ్డిని క్షమాపణలు కోరుతూ ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా ఉంది. చిన్న తరహా పరిశ్రమల యాజమన్యాలు చేసిన ధర్నాలో మాట్లాడినప్పుడు అనుకోకుండా.. మీపై కొన్ని మాటలు వాడాను. మీరు సంబంధిత మంత్రి కాబట్టి మీ పేరు పలకాల్చి వచ్చింది. అయితే మంత్రిగా మీ బాధ్యత గురించి మాట్లాడి ఉంటే ఇంత వివాదం ఉండదు. వ్యక్తిగతంగా మిమల్ని ఇబ్బంది పెట్టే రాజకీయ పరిభాష కాని మాట వాడడం తప్పే. మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం నా తప్పే. క్షమించాలని కోరుతున్నానని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kollapur mla jupalli krishna rao
Chiru holi subhakakshalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles