15 mlas besides 3 ex ministers watched porn

15 MLAs besides 3 ex-ministers watched porn,Karnataka MLAs, Karnataka porn scandal,Karnataka assembly porn scandal, Karnataka porn scandal, Karnataka, Porn, BJP

15 MLAs besides 3 ex-ministers watched porn

MLAs.gif

Posted: 03/05/2012 11:19 AM IST
15 mlas besides 3 ex ministers watched porn

15 MLAs besides 3 ex-ministers watched porn

కర్నాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపిన నీలి చిత్రాల వీక్షణ మరో మలుపు తిరిగింది. నాడు నిండుసభలో అశ్లీల చిత్రాలు చూసింది ముగ్గురు మాత్రమే కాదని, 15 మంది ఎమ్మెల్యేలు ఆ వీడియోను వీక్షించారని ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సభా కమిటీ సభ్యుడొకరు తెలిపారు. సభలో అశ్లీల వీడియోలను వీక్షించిన ఆ 15 మంది ఎమ్మెల్యేల్లో బిజెపి సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారని సభా కమిటీ సభ్యుడు, బిజెపి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్‌ చెప్పారు. అయితే దీన్ని ప్రతిపక్ష సభ్యులు ఖండిస్తున్నారు. తమపై వచ్చిన అపవాదును ఇతరులపై నెట్టేందుకు బిజెపి వేస్తున్న ఎత్తుగడ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణ చెప్పారు. ఈ అశ్లీల దృశ్యాలను శాసనసభ్యులు చూసిన భాగోతాన్ని ప్రసారం చేసిన రెండు టీవీ ఛానెళ్ల ప్రతినిధులను దర్యాప్తు కమిటీ ప్రశ్నించిన కొద్దిరోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం. ఈ అశ్లీల దృశ్యాలు తిలకిస్తూ అడ్డంగా దొరికిపోయిన బిజెపి మంత్రులు సిసి పాటిల్‌, లక్ష్మణ సివాడి, కృష్ణ పలేమార్‌ను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా వేటు వేసిన విషయం విదితమే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharatnatyam dance
Election close up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles