ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హోటల్ భవనం కుప్పకూలింది. జీహెచ్ఎంపీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ ప్రాంతంలో ఉన్న పంజాబ్ బార్ అండ్ రెస్టారెంట్ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కూలడంతో చుట్టు ప్రక్కల జనాలు భయ భ్రాంతులకు గురయ్యారు.
గత కొద్ది రోజుల నుండి ఆ హోటల్ ని మూసివేసి శిధిలావస్థలో ఉన్న పాత భవనానికి మరమత్తులు చేస్తున్నారు. ఈ మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ భవనం ఒక్కసారిగా కూలినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలో ఇద్దరు పుట్ పాత్ వ్యాపారులతో సహా ఆ భవనంలో పని చేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిధిలాల్లో ఇంకా చాలా మందే ఉండి ఉంటారని అక్కడి వారు చెబుతున్నారు. శిధిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉ:ది.
ఈ సంఘటనతో జీహెచ్ఎంసీ అధికారుల డొల్లతనం బట్టబయలు అయింది. ఇప్పటికైనా తేరుకొని నగరంలోని శిధిలావస్థ భవనాలకు గుర్తించి ప్రమాదాలను అరికట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more