Gali janardhan reddy seeks custody of his chopper

Gali Janardhan Reddy seeks custody of his chopper,Gali Janardhan Reddy custody details,Gali Janardhan Reddy latest news videos,illegal mining case Gali Janardhan Reddy and brother-in-law B V Srinivasa Reddy petition special court CBI cases custody

Gali Janardhan Reddy seeks custody of his chopper

Gali01.gif

Posted: 02/10/2012 04:36 PM IST
Gali janardhan reddy seeks custody of his chopper

Gali Janardhan Reddy seeks custody of his chopperఅక్రమ గనుల తవ్వకం , ఎగుమతులతో వందల కోట్ల వ్యాపారం చేసిన ఓఎంసీ సస్థ నెలవారీ వాయిదాల పద్దతి ( ఈఎంఐ) లో హెలికాప్టర్ ను కొనుగోలు చేయడం విశేషం. సీబీఐ జప్తు చేసిన తమ వాహనాలు విడుదల చేయాలంటూ జైల్లో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి బి. వి. శ్రీనివాస రెడ్డిలు వేర్వేరుగా కోర్టులో దాఖాలు చేసిన దరఖాస్తుతో ఈ విషయం బయటపడింది. సీబీఐ దాడులు నిర్వహించి వారికి చెందిన హెలికాప్టర్ తో పాటు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఆ వాహనాలను వినియోగించకపోతే పాడైపోయే ప్రమాదం ఉందని అందువల్ల వాటిని తమకు అప్పగించాలని వారిద్దరు తమ దరఖాస్తుల్లో కోరారు. 2006 లో రూ. 1.35 కోట్లు, అనంతరం కొంత మొత్తాన్ని చెల్లించి ఓఎంసీ పేరుతోనే హెలికాప్టర్ ను కొనుగోలు చేసినట్లు శ్రీనివాస రెడ్డి చెప్పారు. దీనికి నెలనెలా రూ. 10.31 లక్షలు ఈఎంఐ చెల్లిస్తున్నామన్నారు. పార్కింగ్ నిమిత్తం రూ. 75 వేలు చెల్లిస్తున్నామని చెప్పారు. సీబీఐ అధికారులు హెలికాప్టర్ ను జప్తు చేచసి ఆ సమాచారాన్ని డెక్కన్ ఛార్టర్ నిర్వాహకులకు, ఆనంతరం కోర్టుకు అందజేశారన్నారు. బళ్లారి పోలీసులు అధీనంలో ఉన్న రెండు కార్లను, ఇంట్లో ఉన్న బీఎండబ్ల్యూ కారుతో పాటు మరో కారును విడుదల చేయాలని శ్రీమినరల్స్ తరపున శ్రీనివాస రెడ్డి తన దరఖాస్తులో కోర్టును కోరారు. తన రోల్స్ రాయిస్ కారును అప్పగించాలని గాలి దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఎప్పుడు అడిగినా వాటిని కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు. వీటిపై విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Areoplane accident
Bjp announces the launch of yuva an internet tv channel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles