Kanimozhi in loakpal discussions in rajyasabha

kanimozhi in loakpal discussions in rajyasabha, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

kanimozhi1.gif

Posted: 12/29/2011 01:04 PM IST
Kanimozhi in loakpal discussions in rajyasabha

అవినీతి కోరలు అణిచేందుకు రూపొందిన లోక్ పాల్ బిల్లు రాజ్యసభలో ఈ రోజు చర్చకు వచ్చింది. లోక్ సభలో పాసైన ఈ బిల్లును నారాయణ స్వామి ప్రవేశపెట్టగా, అరుణ్ జైట్లీ ఈ బిల్లు మీద ప్రారంభోపన్యాసమిచ్చారు. అవినీతి కుంభకోణంలో పీకలదాకా ఇరుక్కుని ఉన్న కనిమొళి కూడా రాజ్యసభలో దర్శనమిచ్చింది. ఎంపీలలో దాదాపూ 150 మీద నేరారోపణలున్నాయని, వారిని వెనక్కి పిలిచే అధికారమే జనం చేతిలో ఉంటే వారు పార్లమెంటులో అడుగే పెట్టుండేవారు కాదని, అందువలన మీరు పార్లమెంటు ఉన్నతమైనదని అంటున్నారు కానీ నిజానికి ప్రజా తీర్పే ఉన్నతమైనదని నిన్న అన్నాహజారే ముంబైలో తాను చేస్తున్న దీక్షా స్థలిలో అన్నారు. కనిమొళిని చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

రాజ్యాంగబద్ధతకు భాజపా సహకరించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో లోక్ పాల్ ఒక ఆటబొమ్మలా ఉంది కానీ పటిష్టంగా లేదని, అటువంటి దానికి రాజ్యాంగబద్ధతేమిటని అన్నారు. మన దేశంలో న్యాయం ఉంటుంది. కానీ చట్టాలు డొల్లగా ఉంటాయని అరుణ్ జైట్లీ అన్నారు. భాజపా కేవలం ప్రవచనాలకే పరిమితమై ఉండదని, ప్రహారం కూడా చేస్తుందని అనగా భాజపా నేతలంతా హర్షాతిశయంతో బెంచీల మీద చేతులతో చరిచారు.

చట్టాలతో పాటుగా మనుషుల్లోనూ పరివర్తన వచ్చినప్పుడే అవినీతి అంతరిస్తుంది. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని ఇతరులు వెలివేసినట్టుగా చూసి వాళ్ళ సమీపంలో ఉండటానికే జుగుప్సని ప్రదర్శించటంతో, అవినీతి పరులకు అవమానం జరిగిన రోజున అవినీతి జాఢ్యం కొద్దికొద్దిగా వదలటానికి అంకురార్పణ జరుగుతుంది. ప్రస్తుతం చర్చలో ఉన్న లోక్ పాల్ లో ఎంపీలకు పూర్తి రక్షణను కల్పించారు. ఎందుకంటే దాన్ని పాస్ చెయ్యవలసింది వారేగా. ఎంపీల కాలపరిమితి 5 సంవత్సరాలయితే వారికి అదనంగా మరో రెండు సంవత్సరాల వరకూ లోక్ పాల్ నుంచి మినహాయింపు కల్పించటం వలన అవినీతికి పాల్పడ్డవారు దర్జాగా చట్టసభల్లో అడుగుపెట్టటమే కాకుండా గద్దె దిగిన తర్వాత కూడా నిదానంగా అన్నీ సర్దుకుని సాక్ష్యాధారాలను తమకు అనుకూలంగా చేసుకోవటానికి కావలసినంత సమయం దొరుకుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special director scrutinises cbi developments
Lathi charge on students demanding fees reimbursement at karimnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles