Apsrtc employees union

nternational news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

nternational news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Apsrtc Employee Union.gif

Posted: 12/24/2011 10:04 AM IST
Apsrtc employees union

RTCఏపీఎస్ ఆర్టీసీలో మళ్ళీ సమ్మె సైరన్ మోగే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సకల జనుల సమ్మెతో సతమతమైన ఆర్టీసీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగింది. అయితే సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు జీతాలు ఇవ్వాలనే డిమాండ్ తో వీరు సమ్మె సైరన్ మోగించడానికి సిద్దపడుతున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలను తక్షణమే చెల్లించకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

అక్టోబర్ 18 తర్వాత విధుల్లో చేరిన వారికి అడ్వాన్సుల చెల్లింపులు జరగలేదని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల వేతనాలను చెల్లించలేదని, అక్టోబర్ 18 లోగా విధుల్లో చేరిన వారిలోనూ కొందరు కార్మికులకు అడ్వాన్సులు ఇవ్వలేదని కార్మికవర్గాలు ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాయి. వేతనాలు ఇవ్వకపోతే ఆందోళనలు చేపడతామని అతి పెద్ద సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్ అల్టిమేటం ఇవ్వగా.. తాజాగా తెలంగాణ కార్మిక సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) కూడా అదే బాట పట్టాయి. మరి దీని పై ప్రభుత్వం ఎలా స్పదిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress nominated posts
Dmk leader stalin admitted to hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles