Chiranjeevi may get ministry in central

chiranjeevi, sonia gandhi, congress, ajith singh,Chiranjeevi All Set to Join Central Cabinet,chiranjeevi central minister, chiranjeevi rajya sabha member, chiranjeevi cwc member, chiranjeevi congress high command, chiranjeevi delhi talks, chiranjeevi central cabinet, chiranjeevi manmohan singh cabinet

Mega star turned politician PRP chief K Chiranjeevi is all set to join the central cabinet very shortly. The Congress High Command wants to reward Chiranjeevi.

Chiranjeevi may get ministry in central.GIF

Posted: 12/12/2011 10:20 AM IST
Chiranjeevi may get ministry in central

Chiranjeeviపీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో కలిపి చాన్నాళ్లయినా ఇంత వరకు చిరు వర్గానికి వచ్చిన లాభం ఏం లేదు. అదే చిరు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఆపదలో ఉన్న కాంగ్రెస్ ను ఆదుకున్నాడు. పార్టీ విలీనం అప్పడు కాంగ్రెస్ ఇచ్చిన మాట ఇంత వరకు నేరవేర్చలేదు. అదీ కాంకుండా పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. మొన్న అవిశ్వాసం సమయంలో అదను చూసి చిరుకొట్టిన దెబ్బకు కాంగ్రెస్ అధిష్టానం కదిలినట్లు ఉంది. త్వరలోనే స్వతంత్ర హోదాలో కేంద్రంలో మంత్రి పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు ఉంది.

తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ అధిష్టాం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాసం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిన చిరంజీవి, ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆయనకు పాలనలో అనుభవం లేనందున ప్రస్తుతానికి స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఆపదలో పార్టీని కాపాడిన చిరు, ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ గులాం నబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
అయితే చిరంజీవికి కేంద్రంలో ఏ పదవి ఇస్తారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీని పై ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి ఓ సలహా ఇచ్చాడు. దానికి  సీఎం కిరణ్ కుమార్ కూడా అంగీకరించి ఆ పేరునే పెట్టారు. ఆ సభలో సీఎం చిరంజీవి సలహాలు ఇక పై ప్రవేశపెట్టే పథకాల విషయంలో తీసుకుంటామని చెప్పారు.

యితే కేంద్రం ప్రవేశ పెట్టే పథకాలకు కూడా చిరుని ఉపయోగించుకోవాలని, చిరు మంచి మంచి సలహాలు ఇస్తాడని సీఎం సోనియాతో చెప్పారని, దీంతో ఆమె కేంద్రంలో ప్రవేశ పెట్టే పథకాలకు సహాయ మంత్రిగా నియమించాలని అనుకుంటున్నారట.  సో... చిరంజీవికి కేంద్రంలో దక్కే పదవి ‘‘కేంద్రపథకాల సహాయ మంత్రి’’ అని అందరు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Electricity feeder lines with 3014 crores estimate
Balakrishna in tdp office monitoring the vasthu changes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles