చాలామంది డబ్బును మదుపు చేసే క్రమంలో తొందరపాటు వ్యవహారాలను వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వున్న పథకాల గురించి ముందుజాగ్రత్త తీసుకోకుండా ఇతరులు చెప్పే మాటలను నమ్మి మోసపోతున్నారు. ఎవరో ఏదో పథకంలో పెట్టుబడి పెట్టారని వారి మాటలు విని, పెట్టుబడులు పెట్టి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ముఖ్యంగా మధ్యతరగతివారు ఇటువంటి ఇబ్బందులకు గురి అవుతుంటారు. తమకు వచ్చే కష్టార్జితంలో మిగిలే డబ్బులను పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి పొందాలనే ఆలోచనతో జాగ్రత్త తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలను, పథకాలను ఎంచుకుంటారు.
కాబట్టి ఇటువంటి వ్యవహారాలలో ఏయే పథకాలను అమలు చేస్తే బాగుంటుంది? ఎంత మదుపు చేస్తే బాగుంటుంది? ఎటువంటి ప్రణాళికలు, ఏయే సమయాలలో పాటించాలి? అనే అంశాలపై నిపుణులు కొన్ని సూచనలను మనకు అందిస్తున్నారు. వీటి ద్వారా మనం తక్కువ సమయంలోనే మదుపు చేసిన డబ్బులతో అధిక రాబడిని పొందవచ్చు.
రాబడి పొందే మార్గాలు.....
ప్రస్తుతకాలంలో చాలామంది బంగారంలో మదుపు చేయడంలో ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మారుతున్న కాలాలను బట్టి, ఆర్థిక మందగమన ప్రభావాల వల్ల వాటి ధర తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. కాబట్టి బంగారంలో మదుపు చేయడంలో పరోక్ష పద్ధతిని అనుసరించడం చాలా మంచిది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ లు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలోగానీ పెట్టుబడి పెట్టే ఆలోచన పెట్టుకోవద్దు. అంతేకాదు... బంగారం పథకం మీద మార్కెట్లో వున్న అనేకరకాల పథకాల నుంచి చాలావరకు దూరంగానే వుండాలని సూచిస్తున్నారు.
మీరు పెట్టుబడి పెట్టేముందు జీవిత బీమా పాలసీ వుందా లేదా అనేది పరిశీలించుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ఎంచుకోవాలి. అంతేకాదు... భవిష్యత్ లో వచ్చే కష్టాలనుంచి బయటపడేందుకు కనీసం ఆరునెలలకు సరిపడేంత వ్యయం మీ దగ్గర వుండాలి. ఇవన్నీ వున్న తరువాత మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకోవడం మంచిది.
సాధారణంగా యుక్తవయస్సులో వున్నవారికి లేదా మధ్యవయస్సులవారికి పదవీ విరమణకు ఎక్కువ సమయం వుంటుంది కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎక్కువ డబ్బులు మదుపు అవ్వడమే కాకుండా భవిష్యత్ లో వచ్చే నష్టాలు, కష్టాల నుంచి సులభంగా గట్టెక్కొచ్చు. ప్రస్తుతకాలాల్లో ఏ ఆఫీసులో అయినా బోనస్ లు, ప్రతి సంవత్సరం జీతం డబ్బులు పెరగడం వంటి సహజం కాబట్టి వాటిని అనవసరంగా ఖర్చు చేయకుండా మదుపు చేసుకుంటే... ఊహించిన దానికంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more
Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం. ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more
Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more
Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు. అయితే వీరు చాలా విషయాలలో... Read more