తీవ్ర ఒత్తిడి నుంచి తప్పించుకోవటం ఎలా? | Stress Control Methods in Easy Way

Stress control methods

Stress Methods, Stress Reduced Methods, Stress Reduce Methods in India, Natural Way Stress Reduce, Stress Control with Food

Stress Control Methods in Easy Way. With Food and Diet Control Stress.

తీవ్ర ఒత్తిడి నుంచి తప్పించుకోవటం ఎలా?

Posted: 08/31/2017 07:05 PM IST
Stress control methods

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది. తాజా సర్వేలు దాదాపు 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరం లోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి.

శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది మానసిక ఒత్తిడి. అంతేకాదు.. మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని సైకోసొమాటిక్ సమస్యలు అంటారు.


ఎలా తగ్గించుకోవాలి...
ఒత్తిడిగా వున్నప్పుడు మౌనంగా ఉండొద్దని మానసిక నిపుణులు అంటున్నారు. ఒత్తిడితో చిరాగ్గా ఉంటే చాలా ఎవరితోనూ మాట్లాకుండా మౌనంగా ఉంటే మంచిది కాదు. ఏ ఒత్తిడినైనా జయించాలంటే ముందు ఆరోగ్యంతో ఉండాలి. ఇందుకోసం మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకుని అలవాటుగా చేసుకోవడం మంచిది. అందుకే ఎప్పటికప్పుడు ఒత్తిడిని అదుపులో ఉంచేలా చూసుకోవాలి.

గందరగోళ పరిస్థితిని దూరం చేసుకోవడం మంచిది. అదే దీర్ఘకాలంలో ఒత్తిడిగా మారుతుంది. అలా కాకుండా రేపు చేయాల్సిన పనులేంటో ముందే ఆలోచించుకోండి. ఉదయం పూట కంగారు ఉండదు. ఒత్తిడిగానూ అనిపించదు. ఇలా ప్రణాళిక ఉండటం వల్ల ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుంది.

తీసుకునే సమతుల ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. మనసారా నవ్వడం వల్ల సగం ఒత్తిళ్లు వాటికవే తగ్గిపోయినట్లు అనిపిస్తాయి. కాబట్టి అన్నివేళలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఫుడ్ తో కూడా...

ఒత్తిడిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచీ సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థం అవుతుంది. దాన్ని బట్టి సమస్య నుంచి తద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులువవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా విడి విడి భాగాలుగా చేసి చూస్తే పరిష్కారం సులభమవుతుందంటారు సైకాలజిస్టులు. యోగా, మెడి ఇందుకు సహకరిస్తాయి. ప్రాణాయామం మంచి ఫలితాన్నిస్తుంది.

అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం. మానసికోల్లాసాన్ని కలిగించే అభిరుచులకు పదును పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. సృజనాత్మకత ఉన్న ఏ పని అయినా ఒత్తిడి నుంచి బయటపడేయడానికి సహకరిస్తుంది. మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడం (సంగీతం లాంటి హాబీలు, ధ్యానం లాంటి వాటి వల్ల) ఒక పాజిటివ్ దృష్టికోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తద్వారా జీవక్షికియలు కూడా సరిదిద్దబడతాయి. అసిడిటీ పోతుంది. హార్మోన్లు సమతులం అవుతాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది. దాంతో ఇతరత్రా శారీరక సమస్యలు కూడా తగ్గిపోతాయి.


- పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. - సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. - ఓ ప్రముఖ మనోవిశ్లేషకులు చెప్పినట్టు ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పటి బాధ రేపు ఉండదు. - ఎక్కువ కాలం ఉండే మన జీవితాన్ని కష్టమయం చేసుకోవడం ఎందుకు... - ఇలాంటి లాజిక్‌లు సమస్యను స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. - ప్రతిరోజూ ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం అవసరం.

జీవితంలో ఎంత డబ్బు ఉన్న ఆరోగ్యంగా లేకపోతే అది వృధానే. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. ఒత్తిడి వల్ల నాలుగు పదులు దాటగానే సకల ఆరోగ్య సమస్యలు ఆహ్వానం పలుకుతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాల్సిందే...లేదంటే భవిష్యత్ లో మీకోసం రోగాలు సమయం కేటాయిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Stress Reduce Methods  Natural Way  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more