The best locations in south india for tourists

yatra tips, south india locations, south india best locations, summer holidays, yatra trips, summer tips, best locations in south india for tourists, ooty, kerala, goa beach, tourists at goa beach

yatra tips, south india locations, south india best locations, summer holidays, yatra trips, summer tips, best locations in south india for tourists, ooty, kerala, goa beach, tourists at goa beach

సమ్మర్ లో సందర్శించాల్సిన దక్షిణ ప్రదేశాలు

Posted: 03/07/2014 10:22 AM IST
The best locations in south india for tourists

ఎవరైనా సమ్మర్ సీజన్ లోనే పర్యటనలు చేయడం ఇష్టపడతారు. సమ్మర్ సీజన్ లో పిల్లలకు శెలవులు బడుల నుంచి శెలవులు ప్రకటించడం వల్ల, అలాగే సమ్మర్ లో వున్న వేడిని చల్లగా ఆస్వాదించాలని పర్యాటకులు చలిగా వున్న ప్రదేశాలకు వెళతారు. కొందరు మన భారతదేశానికి దక్షిణవైపు వున్న ప్రదేశాలకు పర్యటనకు వెళితే.. మరికొందరు ఉత్తరవైపు వున్న జమ్మూకాశ్మీర్, హిమాలయాలు, ఇంకా తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. అయితే మన దక్షిణ భారతదేశంలో ఎటువంటి ప్రదేశాలు సమ్మర్ లో పర్యటించేందుకు అనువైనవో ఒకసారి పరిశీలిద్దాం.... 

ఊటీ... మన దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాలలో ఇదొకటి. ఇక్కడున్న పచ్చని వాతావరణం సమ్మర్ లో వున్న వేడిని తగ్గించి, ఎంతో ఆహ్లాదకరాన్ని పెంచుతుంది. ఇక్కడున్న సుందరమైన నీలగిరి కొండలు తప్పక చూడదగిన ప్రదేశం. 

జోగ్ ఫాల్స్... ఈ ప్రాంతం చాలావరకు జలపాతాలతో నిండి వుంటుంది. ఇక్కడున్న జలపాతాలు వేసలో వున్న ఉష్ణోగ్రతను తగ్గించి, మనలో ఉన్న ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ జలపాతాలు పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తాయి. 

గోవా బీచ్... గోవాలో నిరంతరం పర్యాటకులు వస్తూనే వుంటారు. చలికాలం, వేసవికాలం అంటూ తేడా లేకుండా నిరంతరం ఇక్కడ సందర్శించేవారు చాలామంది వుంటారు. వేసవిలో ఇక్కడ వేడి వున్నప్పటికీ, గోవా బీచ్ సందర్శించడానికి చాలా అనువైంది. ఇక్కడ వేసవిలో మనకు కావాలసిన వసతులన్నీ కూడా చాలా తక్కువ ధరలకే లభ్యమవుతాయి. 

తేక్కడి... కేరళ రాష్ట్రంలో వున్న ఈ ప్రదేశం సందర్శించడానికి చాలా అనువైనది. వేసవి వేడి మొదలైనప్పటి నుంచి ఇక్కడి వాతావరణం చాలా అనుకూలంగా వుంటుంది. పచ్చని వాతావరణం నెలకొంటుంది. 

అరకు వాలీ... ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం. ఎందుకంటే.. మార్చినెల మొదలైనప్పటి నుంచి వేసవి ఉష్ణోగ్రత తగ్గేంతవరకు ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలంగా వుంటుంది. ఇక్కడున్న పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని పెంపొందిస్తుంది. అంతేకాదు.. ఇక్కడ చూసే ప్రదేశాలు కూడా చాలానే వున్నాయి. 

మున్నార్... ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న అందమైన వాతావరణం కలప్రదర్శనకు ఎంతో అనుకూలమైంది. ఇక్కడ నిరంతరం పర్యాటకులు విహరిస్తూనే వుంటారు. 

కొడైకెనాల్... సాధారణంగా ఈ ప్రాంతం పేరును మనం నిత్యం వింటూ వుంటాం. వేసవిలో ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ అనే సాహసక్రీడను నిత్యం నిర్వహిస్తూ వుంటారు. చాలావరకు పర్యాటకులు ఈ ఆటను చూడటానికే ఇక్కడి వస్తుంటారు. పైగా వేసవిలో ఇక్కడ చల్లటి వాతావరణంతోపాటు సందర్శించే ఎన్నో ప్రదేశాలు కూడా వున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Driving tips for old age persons

    మలివయసులో డ్రైవింగ్ చేసేవారికి టిప్స్!

    Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more

  • The best places in gujarat

    గుజరాత్ లోని పర్యాటక ప్రదేశాలు

    Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more

  • Best places for tourist in delhi

    ఢిల్లీలో పర్యటించాల్సిన ప్రదేశాలు

    Mar 21 | మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ... Read more

  • Nainital city life culture

    నైనిటాల్... భారతదేశపు సరస్సుల ప్రాంతం

    Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more

  • Vellore city culture

    ‘ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు’

    Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more