Bhogi Festival Special | భోగి పండుగ.. భోగభాగ్యాల వెల్లువ

Bhogi festival special

Bhogi, Bhogi Special, Bhogi Details, Bhogi Festival History, Bhogi 2018

Bhogi is the first day of the Pongal festival. According to the Gregorian calendar it is normally celebrated on 13 January but sometimes it is celebrated on 14 January.It is a festival celebrated widely in Tamil Nadu, Andhra Pradesh and Telangana.On Bhogi, people discard old and derelict things and concentrate on new things causing change or transformation. At dawn, people light a bonfire with logs of wood, other solid-fuels and wooden furniture at home that are no longer useful.

భోగభాగ్యాల భోగి పండుగ

Posted: 01/13/2018 11:13 AM IST
Bhogi festival special

సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో- వణికించే చలిలో.. ఎగిసిన భోగి మంట ఒక కమనీయ అనుభూతి. ఆ మంట చుట్టూ చేరి చలి కాచుకోవడం ఓ గొప్ప అనుభవం. భోగి పండగ కేవలం సంప్రదాయ వేడుక మాత్రమే కాదు. మనసునీ, శరీరాన్నీ ఉత్తేజింపజేసే సందర్భం. 

సంక్రాంతి రోజుల్లో చలి ఎక్కువ. చలితో పాటు, బద్ధకం, ఇతర శారీరక రుగ్మతలూ చుట్టుముడతాయి. అప్పటికే వ్యవసాయ పనులూ దాదాపుగా పూర్తయిపోతాయి. అంతకు కొన్నిరోజుల ముందు వరకూ శ్రమించిన శరీరం విశ్రాంతిని కోరుతుంది. విశ్రాంతి ఎక్కువైతే ఉత్సాహం స్థానంలోనే బద్ధకం చోటుచేసుకుంటుంది. ఇలాంటి భావన నుంచి బయట పడడానికీ, శరీరంలో అణువణువూ వేడి రగిలించి, ఉత్సాహాన్ని నింపడానికీ భోగి పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని కొందరు చెబుతుంటారు. పండగ గురించి ఎన్నిరకాల కల్పిత గాథలున్నా అంతిమ లక్ష్యం జీవశక్తికి చైతన్యాన్ని అందించడమే.

'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట పుట్టిందంటారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు.

వరికుప్పల నూర్పిడి అవగానే మిగిలిన పదార్థాలను మంటగా వేయటం వల్ల పుష్యమాస లక్షణమైన చలి తగ్గి, వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. భోగి మంటలకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాటాకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్నిరోజుల ముందే కొట్టుకొచ్చి, భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపుల్ని ఇళ్ళ వద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. మండే స్వభావమున్న పనికిరాని పాత వస్తువుల్నీ బోగిమంట కోసం సేకరిస్తారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దా మంటల సెగతో కాగిన వేడినీటితో తలస్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. పండగ నెలలో ముగ్గులు ప్రతిరోజూ వేస్తారు. కానీ భోగి రోజు వేసే ముగ్గూ ప్రత్యేకమే.

పిల్లల సంబరం...

పిల్లలకు బాగా నచ్చేదీ ఇదే! భోగి పండగలో కీలకమైన భోగి మంటలు వేయడానికి ఉత్సాహంతో ఉరకలేసేది ఎక్కువుగా పిల్లలు, కుర్రకారే. ఎక్కడెక్కడి నుంచో పాతబడిన చెక్క సామాన్లు, కలప దుంగలు సిద్ధం చేసుకుని, ముందురోజే వాటిని భోగి మంట వేయడానికి తగిన స్థలం వద్దకు చేర్చేసి, తెల్లవారు జామునే తమ పని మొదలుపెడతారు. సహజంగా ఎముకలు కొరికే చలిలోనూ ఉత్సాహంగా ఉండేది పిల్లలు, యువతే. అందువల్ల ఈ భోగి మంటలు రాజేయడమూ వారి పండగగానే ఉంటోంది. మిగిలినవారూ ఈ భోగి మంటల్లోని వెచ్చదనాన్ని ఆస్వాదించినా వారు కాస్త తెల్లారాకే ఆక్కడకొస్తుంటారు.

భోగిపళ్లు...

భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. వీటిలో ముఖ్యమైనవి రేగిపళ్లు. వీటిని సంస్కృతంలో బదరీఫలాలు అంటారు. భోగి పళ్లల్లో చామంతి, బంతి పూరేకలు, అక్షింతలు, చిల్లర నాణేలు, పాలకాయలూ కలిపి పిల్లల తలపై పోస్తారు. ఈ ప్రక్రియ వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని కొంతమంది విశ్వాసం. భోగి పళ్ల పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పసుపు, కుంకుమలు పెడుతుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా భోగినాడు సాయంత్రం కొంతమంది బొమ్మలకొలువూ ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల బొమ్మల్ని కొత్తవాటితో జత కలిపి ప్రదర్శించి, ఆనందిస్తారు.

కొత్తకు స్వాగతం...

పాత వాటిని ఆలాగే పట్టుకుని వేలాడకుండా కొత్తని స్వాగతించాలన్నది భోగి మంటల వేడుకలో ఆంతరార్థం. పాత వస్తువులను ముఖ్యంగా చెక్కతో తయారుచేసిన వాటిని ఇలా బోగిమంటల్లో వేయడం ఆనవాయితీగా వస్తోంది. మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా ఎక్కువ వ్యామోహం పనికిరాదు. అలాంటి కోర్కెలేవైనా మనసులో ఉంటే, వాటికి స్వస్తి పలకాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాటను ఎవరూ వినరు. అందుకే భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల ఆలోచన.
ఇంట్లో విరిగిన కుర్చీలు, బల్లలు మొదలైన వాటిపై చాలా మందికి మితిమీరిన మమకారం. ''అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు'' అని పట్టుకు వేళ్లాడుతుంటారు. అలాంటి ఆలోచనలకు స్వస్తి పలికేందుకే భోగి మంటలు వేస్తారని కొందరు చెబుతుంటారు. భోగిమంటలకూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. భోగి మంటల కోసం వంట చెరకును వాడరు. కేవలం పాత సామాన్లు, దుంగలతోనే మంటల్ని వేస్తారు.

పర్యావరణ హితంగా...

భోగి మంటలూ ఇటీవలి కాలంలో దీపావళి కాలుష్యంలాగే మారుతున్నాయి. ఈ మంటల్లో కలప దుంగలు, కర్ర సామగ్రి, పేడ పిడకలు వేయడాన్ని తగ్గించి, చాలా మంది పాతటైర్లు, ప్లాస్టిక్‌ సామాన్లు, రబ్బరు వస్తువులు, ప్లాస్టిక్‌ వైర్లు, కవర్లు వంటివి వేస్తున్నారు. వీటికి అదనంగా పెట్రోలు, కిరోసిన్‌ వంటివి వేసి మరీ మంటలు పెంచుతున్నారు. ఫలితం విపరీతంగా విషవాయువులు వెలువడుతున్నాయి. ఇది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తోంది. దాన్నుంచి వెలువడే కాలుష్యం చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అందుకే మనం సంప్రదాయంగా, సరదాగా వేసుకునే భోగి మంటలు పర్యావరణ హితంగా ఉండాలి. అప్పుడే పండగలోని అసలైన సందేశం నెరవేరుతుంది.

తెలుగు ప్రజలకు తెలుగు విశేష్ తరపున భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more

  • Special article on bakrid festival

    త్యాగానికి ప్రతీక.. బక్రీద్ పర్వదినం

    Sep 13 | ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను... Read more