Bellary raghava alias tadipatri raghavacharlu biography

bellary raghava, bellary raghava news, bellary raghava history, bellary raghava biography, bellary raghava latest news, bellary raghava story, bellary raghava life story, bellary raghava dramas, tadipatri raghavacharlu news

bellary raghava alias tadipatri raghavacharlu biography who is a great artist in drama

రంగస్థల రారాజు.. బహుముఖ ప్రజ్ఞ మన బళ్లారి

Posted: 09/23/2014 04:53 PM IST
Bellary raghava alias tadipatri raghavacharlu biography

ఇంకా చలనచిత్ర పరిశ్రమ రాకముందే తెలుగునాటకరంగంలో ఎందరో గొప్ప నటులు తమతమ నటన ప్రతిభతో ప్రత్యేక ప్రస్థానాలను ఏర్పరుచుకున్నవారున్నారు. అందులో మన బళ్లారి రాఘవ ఒకరు. ఈయన న్యాయవాది పట్టా పొందినప్పటికీ నాటకాలలో ప్రత్యేక అభిమానం వుండటం వల్ల ఆయన ఆ కళారంగంలో రాణించారు. తన మొత్తం సమయాన్ని, సంపదను కేవలం నాటకరంగ పురోగతికోసమే వెచ్చించారు. అంతటి అభిమానం నాటకరంగం మీద ఆయనకు వుండేది. నాటకరంగం మీదున్న ఆసక్తియే నేడు ఆయన్ను రంగస్థల రారాజుగా నిలిచిపోయే చేసింది.

జీవిత చరిత్ర :
బళ్లారి రాఘవ అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్లు. ఈయన 1880 ఆగస్టు 20వ తేదీన అనంతపురంలో జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో జన్మించారు. ఆతని తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. మొదట బళ్లారి హైస్కూల్ లో మెట్రిక్ పూర్తి చేసిన ఈయన.. 1905లో మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణత పొందారు. అక్కడే న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన ఆయన.. న్యాయవాదిగా ముఖ్యంగా క్రిమినల్ కేసులను వాదించడంలో ప్రసిద్ధి చెందారు. దీంతో ఆయనకున్న ఈ ప్రతిభను గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం... ఆయనకు ‘‘రావు బహద్దూర్’’ అనే బిరుదును ప్రసాదించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. కానీ ఆయనకు నాటకాలంటే ప్రత్యేకాభిమానం వుండేది.

చిన్నతనం నుంచే రాఘవకు నాటకరంగంపై ఎంతో ఆసక్తి వుండేది. ఈయనకున్న ఈ ఆసక్తిని గమనించి ఆయన మేమమామ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆయన్ను ప్రోత్సాహించారు. దీంతో రాఘవ తన 12వ ఏటలోనే మొదటిసారిగా రంగస్థలంపై నటించారు. అలాగే బళ్ళారిలో షేక్స్‌పియర్ క్లబ్ స్థాపించి, తద్వారా అతని నాటకాలు ప్రదర్శించేవాడు. బెంగళూరులో కోలాచలం శ్రీనివాసరావు నడిపే 'సుమనోహర' అనే సంఘం ప్రదర్శించే నాటకాలలో ప్రధాన పాత్రలను ఎక్కువగా బళ్ళారి రాఘవ పోషించేవాడు. హావభావ ప్రకటనలోను, డైలాగులు చెప్పడంలోను రాఘవ అసమానుడనిపించుకొన్నారు. విదూషక పాత్ర అయినా, మహారాజు పాత్రయినా రాఘవ అవలీలగా పోషించేవాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలన్నింటిలోనూ రాఘవ ప్రదర్శనలిచ్చాడు.

బళ్ళారి రాఘవ శ్రీలంక, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పర్యటించి భారతీయ నాటకాలు, కళలగురించి ఉపన్యాసాలు, సెమినార్లు ఇచ్చాడు. 1927లో ఇంగ్లాండులో లారెన్స్ ఆలివర్, ఛార్లెస్ లాటన్ ‌ప్రభృతులతో కలిసి ప్రదర్శనలిచ్చాడు. అమెరికా, రష్యా వంటి దేశాలనుండి కూడా ఆహ్వానాలు అందినాయి గాని ఆయన వెళ్ళలేకపోయాడు. 1930లో మద్రాసులో రాజమన్నారు రచించిన "తప్పెవరిది?" నాటక ప్రదర్శనం తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు.  మహాత్మా గాంధీ, రవీంద్రనాధ టాగూరు, జార్జి బెర్నార్డ్ షా వంటివారు రాఘవ నాటకాలను ప్రశంసించారు. రాఘవలో ఇంకొక ప్రత్యేకమైన విషయమేమిటంటే.. ఈయన మహిళల్ని కూడా నాటకరంగంలో పాల్గొనడానికి ఎంతో ప్రోత్సాహించారు. ఈయన ప్రోత్సాహంతోనే కొప్పరపు సరోజిని, కొమ్మూరి పద్మావతి, కాకినాడ అన్నపూర్ణ వంటి స్త్రీలు ఆయన నాటకాలలో నటనను ప్రారంభించి తరువాత ప్రసిద్ధ రంగస్థలనటీమణులయ్యారు.

ఇలా నాటకరంగంలో కొనసాగుతున్న నేపథ్యంలోనే రాఘవ మిత్రలు ఒత్తిడి చేయడంతో ఆయన 1936 సినిమా రంగంలో ప్రవేశించారు. ‘‘ద్రౌపదీ మాన సంరక్షణం’’లో దుర్యోధనుడిగానూ, ‘‘రైతుబిడ్డ’’ సినిమాలోనూ, రాజరాజేశ్వరివారి ‘‘చండిక’’ అనే మూవీలోనూ నటించారు. అయితే సహజ స్వతంత్ర నటుడైన రాఘవ.. సినీరంగంలో ఇమడలేకపోయారు. న్యాయవాదిగా, కళాకారుడిగా బాగాపేరు సంపాదించుకున్న రాఘవ.. 1993లో కొందరు మిత్రులు తనను బళ్లారి మునిసిపల్ కౌన్సిల్ కు పోటీ చేయమని ఒత్తిడి చేయడంతో ఆయన రాజకీయరంగంవైపు అడుగులు వేశారు. దీంతో ఆయన వీధివీధికి వెళ్లి ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే ఆయనతోపాటు వచ్చిన బసప్ప.. ఓటర్లను ఓటు వేయమని అడిగిన నేపథ్యంలో వాళ్లు మౌనంగా వుండటంతో అతనికి కోపం వచ్చి ఓటర్లను తిట్టాడు. దీంతో బాధపడ్డ రాఘవ.. వెంటనే ఇంటికి వచ్చి తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకుని, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఈ విధంగా ప్రస్థానాన్ని సాఘించిన ఆయన.. 1946ల ఏర్పిల్ 16న మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellary raghava  telugu drama artists  telugu famous actors  tollywood  

Other Articles