హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం అందుతోంది. ఖాతాలను డిలేట్ చేసే ముందు ‘‘ నాకు కాస్త విశ్రాంతి కావాలి. నాకు మనోధైర్యం ఇచ్చిన మీ అందరికీ థాంక్స్. నేను మీతోనే ఉంటాను’’ అంటూ పేర్కొంది.
విషయం ఏంటంటే.. రోలింగ్ స్టోన్ మ్యాగ్జైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవాన్ తాను రేప్ కు గురైనట్లు ప్రకటించింది. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దగ్గరి వ్యక్తి ఒకరు అత్యాచారం చేశాడని, అంత జరిగినా తాను జాగ్రత్తగా ఉండకపోవటంతో కొన్నాళ్లకు ఓ బార్ యజమాని తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించింది. ‘‘ఆ వయసులో చనిపోదామనకున్నా. కానీ, నేనేం తప్పు చేశాను. వాళ్లే మృగాళ్లుగా మారి నన్ను అనుభవించారు. దానికి నేనేందుకు చనిపోవాలి. అందుకు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా’’ అంటూ అందులో పేర్కొంది.
అంతే ఆ దెబ్బకి ఆమె సోషల్ మీడియా ఖాతాలన్నీ పరామర్శలతో నిండిపోయింది. ఆ దాటికి తట్టుకోలేని ఆమె తన ఖాతాలన్నింటిని కొంత కాలంగా తొలగించేందుకు నిర్ణయించింది. కాగా, ఇవాన్ కు గతంలో జామై బెల్ అనే నటుడితో వివాహం జరిగి, ఆపై విడాకులు కూడా అయ్యింది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ మరిలిన్ మాన్సన్ తో డేటింగ్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more
Sep 18 | ఏదైనా ఒక రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నవారు తమకంటూ ఒకరు ఇన్స్పిరేషన్ గా వుంటారంటూ అప్పుడప్పుడు చెబుతుంటారు. అలా తమ అభిమానాన్ని సీనియర్లపై చాటుకున్న వారు క్రీడాకారులు, నటీనటులు ఎందరో వున్నారు. ఇప్పుడు... Read more