ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు భిన్నంగా నడుచుకుంటూ తన క్రేజ్ ని రోజురోజుకూ పెంచుకుంటోంది. ‘ఆంటీ’ల జాబితాలోకి చేరిపోయినప్పటికీ అమ్మడు తన ఘాటుతనాన్ని మరింత పెంచుతోంది. ఇందుకు ఉదాహరణగా.. ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘మేరా నామ్ మేరీ’ అనే ఐటమ్ సాంగ్ ను తీసుకోవచ్చు. ఆ పాటలో మునుపెన్నడూలేని విధంగా ఎక్స్ పోజ్ చేసి కుర్రకారు మతి పోగొట్టేసింది. దీంతో.. కథానాయికల కెరీర్ ఏడెనిమిదేళ్లకు మించి సాగదనే అభిప్రాయన్ని కరీనా కపూర్ అబద్ధం చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇండస్ట్రీలో దాదాపు పదిహేనేళ్లుగా కథానాయికగా కొనసాగుతున్న కరీనా.. ఇప్పుడు 35వ ఏటలోకి అడుగుపెట్టింది. సోమవారంతో 35 ఏళ్లు నిండిన కరీనా.. కుర్ర తారలకు ఇంకా మంచి పోటీనే ఇస్తోంది. తన 35వ పుట్టిన రోజును కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి జరుపుకుంది. భర్త సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఢిల్లీలోని పటౌడీ ప్యాలెస్‌లో పార్టీ మూడ్‌లో హుషారుగా గడిపింది. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమై సోమవారం తెల్లవారుజాము వరకు అతిథులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. కరీనా అక్క కరిష్మా కపూర్, స్నేహితులు అమృతా అరోరా, మలైకా అరోరా, ఇంకా మరికొందరు స్నేహితులతో కలిసి చిందులేశారు. పార్టీకి సంబందించిన ఫొటోలను మలైకా అరోరా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇదిలావుండగా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో కలిసి ‘కీ అండ్ కా’ చిత్రంలో కరీనా నటిస్తోంది. ఈ చిత్రంలో కరీనా ఆఫీస్‌లో ఉద్యోగం చేసే భార్యగా నటిస్తుండగా, అర్జున్ ఇంట్లోనే ఉండే భర్త క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత కరీనా చేతిలో మరిన్ని ఆఫర్లు వున్నాయని, అలాగే మరికొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగు నృత్యించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలొస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 18 | ఏదైనా ఒక రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నవారు తమకంటూ ఒకరు ఇన్స్పిరేషన్ గా వుంటారంటూ అప్పుడప్పుడు చెబుతుంటారు. అలా తమ అభిమానాన్ని సీనియర్లపై చాటుకున్న వారు క్రీడాకారులు, నటీనటులు ఎందరో వున్నారు. ఇప్పుడు... Read more