Jarra Jarra Video Song Promo from Valmiki వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ నుంచి జర జర సాంగ్ అదుర్స్.!

First single jarra jarra from varun tej valmiki released

Varun Tej, Valmiki, Pooja Hegde, jarra jarra, Varun Tej Valmiki jarra jarra song, valmiki jarra jarra song promo, Valmiki video song, Valmiki song social media, Dimple Hayathi, Varun Tej Dimple Hayathi, Harish Shankar, Mickey J Meyer, Bhaskarabhatla, Anurag Kulkarni, Uma Neha, tollywood, movies, entertainment

The team of Valmiki released a lyrical video of the first number from the film titled Jarra Jarra. Director Harish Shankar posted the video on his social media. Music director Mickey J Meyer composed for the number while lyricist Bhaskarabhatla penned the lyrics.

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ నుంచి జర జర సాంగ్ అదుర్స్.!

Posted: 08/22/2019 05:32 PM IST
First single jarra jarra from varun tej valmiki released

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విభిన్నమైన చిత్రాలను ఎంచుకుని నటిస్తున్నాడు. తన కెరీర్ లో స్మూత్ అండ్ స్టడీగా కొనసాగించేందుకు సిద్దమైన మెగా ప్రిన్స్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ భయంకరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ తో పాటు తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న పూజా హెగ్డే వరుణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది.  

14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమిళ సినిమా ‘జిగర్తాండ’కు వాల్మీకి చిత్రం రీమేక్ గా వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిలోని వరుణ్ తేజ్ కిల్లింగ్ లుక్ మెగా అభిమానులను ఊపేస్తుంది. తాజాగా విడుదలైన ‘వాల్మీకి’ పాట ప్రోమో అయితే మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించేలా ఉంది. ‘జర్ర జర్ర’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్‌ ప్రోమోను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

ఇప్పటికే బయటికొచ్చిన రఫ్ లుక్‌లోనే వరుణ్ తేజ్ ఈ పాటలో కనిపించారు. ‘అభినేత్రి 2’లో నటించిన డింపుల్ హయాతి ఈ పాటలో నర్తించింది. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ ఆలపించారు. మిక్కీ జే మేయర్ స్టైల్‌కి విరుద్ధంగా మంచి మాస్ బీట్‌తో సాగుతుంది ఈ పాట. డింపుల్ హయాతి తన అందాలతో పాటను ఒక ఊపు ఊపేసింది. ‘సూపరు హిట్టు నీ హైటు.. సూపరు హిట్టు నీ రూటు.. సూపరు హిట్టు హెడ్డు వెయిటు.. సూపరు హిట్టు బొమ్మ హిట్టు’ అనే లైన్స్ అదిర్స్ అనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Valmiki  jarra jarra song  Dimple Hayathi  Harish shanker  mickey j meyer  tollywood  

Other Articles