మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తి. ఇండస్ట్రీలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ ఫ్యాన్స్ ఖాతాలో మడొంతులపైగా సినిమా ఇండస్ట్రీ వుందంటే అతిశయోక్తి కాదు. వీరిలో చాలా మంది తమకు చిరంజీవి స్వయంకృషి ఎదిగిన తీరు స్ఫూర్తి అని చెబుతుంటారు. అలాంటి వాళ్లలో సంగీత సంచలనం, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఒకరు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్‌కు చిరంజీవి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో దేవి మరో స్థాయికి వెళ్లిపోయారు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
చిరంజీవి ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాలకు కూడా దేవీనే సంగీతం సమకూర్చారు. అంతెందుకు చిరు రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’కి కూడా దేవీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవీపై చిరంజీవికి అంత నమ్మకం. మెగాస్టార్ తనపై కురింపించిన ప్రేమను దేవీ శ్రీ ప్రసాద్ అవకాశం దొరికినప్పుడల్లా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా దేవీ శ్రీ కాన్సెర్ట్ జరుగుతుందంటే అందులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పుడు ఆ సాంగ్‌ను దేవి మరోసారి వినిపించే అవకాశం ఆయనకు వచ్చింది.
ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. నేడు చిరంజీవి 64వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ‘సూపర్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్‌డే’ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో తన టీమ్‌తో కలిసి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్‌ను ఆలపించిన వీడియోను పొందుపరిచారు. ఈ వీడియో ద్వారా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు దూసుకుపోతోంది. చిరంజీవి అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. లైకులు కొడుతున్నారు.
Wishing our Dearest 1 & Only #MEGASTAR #Annayya #Chiranjeevi Sir a SUPER DUPER MUSICAL HAPPY BIRTHDAY !!
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 22, 2019
Love frm my Whole Team#SyeRaaNarasimhaReddy #HBDMegaStarChiranjeevi @KonidelaPro #RamCharan @upasanakonidela @IAmVarunTej @IamSaiDharamTej pic.twitter.com/v5jNjLc7oB
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more