• masa
  • masa
Dhanus Raasi

ఆదాయం - 2; వ్యయం - 8; రాజపూజ్యం - 6; అవమానం - 1

మార్చి : కుటుంబసభ్యులతో విరోధాలు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో అనవసర కంగారు, తికమక, మనసులో భయాందోళనలు వంటివి ఇబ్బంది కలిగిస్తుంటాయి. పరులు ద్రవ్యం కోసం ప్రాకులాడుతారు.

ఏప్రిల్ : నూతన వ్యక్తులతోటి ముఖ్యంగా స్త్రీలతో అయాచిత విరోధాలు పెరుగుతాయి. మాటపడుట, అహంకార ధోరణులు ప్రదర్శించడం వంటివి వుంటాయి. మాతృ సమానులైన పెద్ద ఆశీర్వచనాలు, సద్భావనలు, సుఖసంతోషాలు, ధన, ధాన్యవృద్ధి కలుగుతాయి.

మే : మనసులో సదుద్దేశం వున్నప్పటికీ ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనస్తాపానికి గురవుతారు. అయినప్పటికీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలు పొందుతారు. ధనధాన్య లాభాదులు పొందుతారు.

జూన్ : అకారణ కలహాలు ఎదుర్కోవలసి వుంటుంది. స్వగౌరవాన్ని కాపాడుకోవడం కోసం అసత్యాలు పలుకుతారు. మనసులో భయాందోళనలకు వున్నప్పటికీ, పైకి గాంభీర్యంగా వున్నట్లు ప్రదర్శిస్తారు. గురు సమానులైన వ్యక్తుల ఆదరాభిమానాలు లభిస్తాయి.

జూలై : అత్యంత ఆప్తులతో విరోధాలు ఏర్పడుతాయి. వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు, వైరాగ్య భావనలు పెరుగుతాయి. అత్యవసర సమయాల్లో మీకంటే చిన్నవారి నుంచి సహాయం పొందాల్సి వస్తుంది.

ఆగస్టు : తీరిక లేని ప్రణాళికలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చాలాకాలం నుంచి వున్న పరిష్కారమవ్వని సమస్యలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం శ్రేయస్కరం.

సెప్టెంబర్ : బంధుమిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యకార్యాలు విజయవంతంగా పూర్తిచేస్ాతరు. ప్రతి అంశంలోనూ గతకాలం కంటే మెరుగు అనే భావన కలగడం వుంటుంది. అధిక ధనలాభం పొందుతారు.

అక్టోబర్ : విద్యాసంబంధ అధికారులు, ఉద్యోగులు అప్పమత్తతో మెలగవలెను. ఆయా సందర్భాల్లో మాటతొందర వల్ల బారీమూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. కుటుంబమందు పెద్దలకు అనారోగ్యం నిలబాటు.

నవంబర్ : ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలితాన్ని అందిస్తాయి. మాసాంతంలో స్వల్ప అనారోగ్య సూచన, వైద్యవృత్తివారికి అనుకూలంగా వుంటుంది.

డిసెంబర్ : మనసులో తలచిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఉద్యోగ లాభాలు, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. సంఘంలో మీ స్థానమునకు వున్న మర్యాద ద్విగుణీకృతమవుతుంది.

జనవరి : విద్యావేత్తలతో సదస్సులు, ఆసక్మిక ధనలాభం, యత్నకార్యసిద్ధి పొందుతారు. సుఖం, ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతాయి. మాసాంత దినాల్లో అనుకోని ప్రమాదసూచన. వ్యాపారస్తులమందు పటిష్టమైన బందోబస్తు వుంచుకోవలెను.

ఫిబ్రవరి : ఇష్టకామ్యార్థ ఫలసిద్ధి కలుగుతుంది. అధిక ద్రవ్యలాభం లభిస్తుంది. ప్రయత్నంచే కార్యలాభం వుంటుంది. కుటుంబవాతావరణం సౌఖ్యంగా వుంటుంది. బంధుమిత్రులలో ఒకరి అతిచనువు చికాకు కలిగిస్తుంది. తోటి ఉద్యోగులలో వ్యతిరేక పవనాలు వీస్తాయి.

మార్చి : శారీరక అసౌఖ్యం, వృత్తివ్యాపారాలయందు నిర్లిప్తత, అనాసక్తి కలుగుతాయి. చేతివృత్తులవారికి శ్రమైక జీవనం వున్నప్పటికీ.. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. శుభమూలక ధనవ్యయం.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma