• masa
  • masa
Vruschika Raasi

ఆదాయం - 14; వ్యయం - 3; రాజపూజ్యం - 14; అవమానం - 1

మార్చి : భోజన అసౌఖ్యం, దుర్వార్తలు, మనస్తాపం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ఒక మోస్తరు విధంగా బాగానే కొనసాగుతాయి.

ఏప్రిల్ : జాయింట్ వ్యాపారులకు అవగాహనా లోపంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మనోల్లాసం, ధనప్రాప్తి, వస్త్ర భూషణాదులు తదితర పొందుతారు. మాసాంతంనందు అధిక ధనవ్యయం, పాపకర్మాశక్తి.
మే : మాటపట్టింపులకు పోయి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఉద్యోగులకు ఇష్టపూర్వక బదిలీలు. ధనం పొందుటలో ఇబ్బందులు వున్నా.. ముందుకు సాగుతారు.
జూన్ : గతకాలంలో నిలిచిన కొన్ని సమస్యలు ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార వ్యవహారాలయందు అనుకూలత వుంటుంది. ధనాలాభం, వ్యాపార విస్తరణ వంటి లాభాలు పొందుతారు.
జూలై : మాసారంభంలో ఆందోళనలు వుంటాయి. యత్నపూర్వక ధనలాభం ఆర్జిస్తారు. విద్యార్థులకు అనుకూలత సమయం. నిల్వ వ్యాపారస్తులకు కాలం అంతగా కలిసిరాదు. కాంట్రాక్టర్లకు అధిక ధనవ్యయం.
ఆగస్టు : వృత్తి వ్యాపారంలో దిగ్గజముల వంటివారి పరిచయాలు లాభిస్తాయి. వృత్తి నైపుణ్యత, విశేష భక్తి భావనలు కలుగుతాయి. ఆర్థిక పరంగా సమస్యలు అంతగా వుండవు.
సెప్టెంబర్ : తలచిన కార్యాలు శీఘ్రమే పురోగమిస్తాయి. కుటుంబసభ్యులకు సలహా, సాయములు అందిస్తారు. గృహవాతావరణం సంతోషంగా వుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అన్యవిషయాల్లో ఆసక్తి కలిగివుంటారు.
అక్టోబర్ : శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వుంటుంది. ఉద్యోగ నిమిత్తం అధిక ప్రయాణాలు చేయక తప్పదు. ఇష్టపూర్వకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఆ కార్యంలో సిద్ధి పొందుతారు.
నవంబర్ : ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంతో వ్యవహరిస్తారు. భూములకు లాభాలు చేకూరుతాయి. క్రయవిక్రయాలు శుభప్రదంగానే కొనసాగుతాయి. ఇష్టపూర్వకంగా ఏదైనా కార్యం తలిస్తే సిద్ధి కలుగుతుంది.
డిసెంబర్ : కుటుంబంలో వున్న పెద్దవారి సహాయసహకారాలతో కార్యాల్లో వృద్ధి పొందుతారు. వృత్తిపరమైన చికాకులు వున్నప్పటికీ సంయమనంతో పురోగతి సాధిస్తారు. సద్గోష్టి, వ్యాపారవృద్ధి తదితర ఫలితాలు వుంటాయి. పుత్రసంతాన విషయంలో, ప్రవర్తనలో మార్పు గమనిస్తారు.
జనవరి : ఆరోగ్యంనందు స్వల్ప లోపాలు వుంటాయి. కథ కార్యక్రమాలయందు నూతన ఉత్సాహం పొందుతారు. ప్రయత్నిస్తే అన్ని కార్యాల్లోనూ సిద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతో స్నేహాపూర్వకంగా మెలుగుతారు.
ఫిబ్రవరి : దురాశతో చేసే పనులు వికటిస్తాయి. స్వల్ప ద్రవ్యలాభములు చేకూరుతాయి. రాజకీయ నాయకులకు కీర్తిభంగం కలుగుతుంది. మాసాంతంలో స్ఫూర్తిదాయకమైన మాటలు మనసును ప్రభావితం చేస్తాయి.
మార్చి : చేయని పనికి నింద భరించాల్సి వుంటుంది. కొన్ని వ్యవహారాలను అధిక శ్రమతో పూర్తి చేస్తారు. ఖర్చులు ఎంత అదుపులో వుంచుకోవడానికి ప్రయత్నించినా వుండవు. కాబట్టి ఆర్థికపరంగా స్వల్ప ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుంది. గతంలో పొందిన వాగ్దానాలు ఇప్పుడు అక్కరకు వస్తాయి.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma