• masa
  • masa
Mesha Raasi

ఆదాయం : 14, వ్యయం : 14, రాజపూజ్యం : 3, అవమానం : 6

మార్చి : తలచిన కార్యాలు ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. అయితే.. ఖర్చు కూడా భరించాల్సి వుంటుంది. ఉద్యోగులకు స్థానమార్పిడులు ఇబ్బంది కలిగిస్తాయి. ఎక్కువ శ్రమిస్తే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నెలమొత్తం శుభంగానే సాగుతుంది.

ఏప్రిల్ : కళాకళలు, ఒకసారి మోదం, ఒకసారి ఖేధం! సంతానం గురించి చింత. అనవసరంగా ఖర్చులు వెచ్చిస్తారు. పిల్లల భవిష్యత్ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. విదేశీయాన ప్రయత్నాలు సఫలం అవుతయి. నెల ప్రారంభంలో కార్యాలయ సంబంధమైన ఒత్తిళ్లు పెరుగుతాయి.
మే : ఈ నెలలో అనారోగ్య సూచనలు ఎక్కువగా వున్నాయి కాబట్టి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొత్తవారిని, వారి మాటలకు అంత తేలిగ్గా నమ్మకూడదు. వ్యాపారరంగంవారికి ఈ మాసం అనుకూలం. అధిక ప్రయాణాలు చేయడం, శారీరక, మానసిక అలసట, విశ్రాంతి వంటి లోపాలు వుంటాయి.
జూన్ : ఈ నెలలో సమయం అనుకూలించి సుఖసంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తారు. కార్యవృద్ధి, మనసు ప్రశాంతంగా వుంటుంది, అధిక ధనలాభం పొందుతారు. మాటకు అధిక విలువ లభిస్తుంది. యజమానుల ద్వారా గౌరవం లభిస్తుంది. అన్యోన్య మిత్రసంబంధాలు పెరుగుతాయి.
జూలై : కుటుంబ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పాటించాలి. ఇతరుల ప్రమేయంతో మాట పట్టింపులు పెరుగుతాయి. వివిధరకాల ఆరోపణలు వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులకు, విద్యాసంబంధ ఉద్యోగులకు, అధికారులకు అనుకూల సమయం.
ఆగస్టు : ఆర్థికపరంగా ఈ నెల కలిసి వస్తుంది. లెక్కాపత్రం లేకుండా చేసే ఖర్చులు విపరీత ప్రభావాన్ని చూపుతాయి. కాస్త శత్రు భయం వుంటుంది. పుత్రసంతానం మూలంగా ఆనందం. ఇరుగు, పొరుగువారితో మాట సంయమనం పాటించాలి.
సెప్టెంబర్ : అనవసర భయాందోళనలు వుంటాయి. బుద్ధిచాంచల్యం, మాట, మనసు నిలకడ లేకపోవడం వంటి ఇబ్బందులు. కుటుంబసభ్యుల్లో అంతర్గత సమస్యలు వుంటాయి. ఈ నెలాఖరున పుణ్యకార్యాచరణం, తీర్థయాత్ర సంకల్పం కలుగుతాయి.
అక్టోబర్ : కుటుంబ వ్యక్తులతో మనస్ఫర్థలు కలిగే అవకాశం వుంది కాబట్టి.. ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు మానసిక ఆందోళనలు పెరుగుతాయి. నెలాఖరున విందు, వినోదాలు, ఇష్టార్థ లాభాలు సమకూరుతాయి. ఉద్యోగులకు యత్నబదిలీలు. ధనలాభం అధికంగా వుంటుంది.
నవంబర్ : కోర్టు వ్యవహార విషయాల్లో జాగ్రత్త పాటించాలి. మందమతితో నష్టపోయే సూచనలు అధికంగా వున్నాయి కాబట్టి.. జాగ్రత్త వహించాలి. మధ్యవర్తిత్వం మొదలైన పనులు అంతగా అనుకూలంగా వుండవు.
డిసెంబర్ : పరోపకారం చేయాలనే తపన కలిగి వుంటారు. ఇది మంచిదే కానీ ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి మాటకు విలువ ఇస్తే.. లబ్ధి పొందుతారు. అవాంఛిత సంఘటనలు మనసుకు చికాకు కలిగిస్తాయి.
జనవరి : సున్నితమైన కాలగమనంలో వున్నారు కాబట్టి.. కోపాన్ని అదుపులో వుంచుకుంటే మంచిది. అధికారులు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తే మేలుగా వుంటుంది. ఆర్థికసంబంధమైన ఉద్యోగులకు పరీక్షాకాలం.
ఫిబ్రవరి : అయిష్టంగా వేరేచోట నివసించాల్సి వుంటుంది. అయితే.. మనసుకు తలచిన కార్యాలు పూర్తిచేయగలుగుతారు. కొత్త వస్తువులు, వస్త్రాదులకోసం అధిక వ్యయం వెచ్చిస్తారు.
మార్చి : ఈ మాసం మొత్తం అనుకూలంగా వుంటుంది. పెద్దలపట్ల గౌరవాభిమానాలు కలిగి వుంటారు. సుఖసంతోషాలతో కాలక్షేపం చేస్తారు. ప్రయాణం చేసేవారు మెళుకువగా వుండాలి. సభాసమావేశాల్లో మీదైన శైలిలో ప్రసంగించి, ప్రశంసలు పొందుతారు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma