the best face packs for face which helps to get glowing, shining and beauty skin withing few days without any harms | skin remedies

Face packs for face to get glow shiny beauty skin home remedies

face packs, skin face packs, skin remedies, skin healthy tips, skin home remedis, skin beauty tips, beauty tips for skin, skin remedies, beauty tips for face, facials, face packs, best packs for face

face packs for face to get glow shiny beauty skin home remedies : the best face packs for face which helps to get glowing, shining and beauty skin withing few days without any harms.

ఈ ఫేస్ ప్యాకులతో అందమైన ముఖచర్మం సొంతం..

Posted: 11/12/2015 01:46 PM IST
Face packs for face to get glow shiny beauty skin home remedies

చర్మసౌందర్యాన్ని మెరుగుపరచడంతోపాటు సహజత్వాన్ని అందించే కొన్ని ఆరోగ్యకరమైన ఫేస్ ప్యాక్స్ అందుబాటులో వున్నాయి. వాటిని కొన్నాళ్లపాటు రెగ్యులర్ గా చర్మానికి పట్టిస్తే.. కాంతులీనే సౌందర్యమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. మరి.. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందామా..

* నారింజ తొక్కలని ఎండలో బాగా ఎండబెట్టాలి. కొన్ని రోజులు ఇలా చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడో పాత్రలో అర టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ తీసుకుని, అందులో ఒక టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మొటిమలు ఉంటే కొన్ని చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాలపాటు అలాగే వుంచుకోవాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరిసే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చునని బ్యూటీషన్లు చెబుతున్నారు.

* మస్క్ మెలోన్‌ను తీసుకుని దానిని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులో కొద్దిగా ఉప్పు లేదా ఫుల్లర్స్ ఎర్త్‌ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి మర్దన చేయాలి. ఇందులో నీళ్ళు అధికంగా ఉండటం వల్ల ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఫలితంగా ముడతలు పూర్తిగా నివారించబడి.. చర్మ నిగారింపు పెరుగుతుంది. మస్క మెలోన్ తో మరో ప్యాక్ చేసుకోవచ్చు. మస్క్ మెలోన్ తొక్క, లోపలి విత్తనాలను తొలగించి.. దాన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలకు పంచదార మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలతో శరీరానికి మర్ధన లేదా మసాజ్ చేస్తే.. చర్మంపై వుండే ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ తొలగించబడతాయి. ఫలితంగా యవ్వనంగా కనబడేలా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

* ఒక పాత్రలో మస్క్ మెలోన్ ముక్కలు, స్ట్రాబెర్రీ 3 వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక చెంచా ఓట్ మీల్, ఒక చెంచా తేనె వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శరీరం, ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. 15 నిముషాలు అలాగే వుంచుకున్న తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా, మృదువుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

* ఒక పాత్రలో ఒక కప్పు మస్క్ మెలోన్ జ్యూస్ తీసుకొని అందులో శెనగపిండి వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాడీ మొత్తం స్క్రబ్ చేసి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం అందంగా.. ఆకర్షణీయంగా మారుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

* బటర్‌ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌కు వేసుకోవడం వల్ల డ్రై స్కిన్ నివారింబడుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెతీసుకొని అందులో 2 చెంచాలా బటర్‌ను మిక్స్ చేయాలి. తర్వాత ఫేస్‌కు ప్యాక్‌గా వేసుకొని కాటన్‌తో తుడిచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

* అలాగే గుప్పెడు బాదంను పొడి, చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్‌ను పూతలా రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే మెరిసే సౌందర్యం లభిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy face packs  beauty tips for skin  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more