Bonda Uma to bid goodbye to TDP టీడీపీకి గుడ్ బై చెప్పనున్న బొండా ఉమ.?

Vijayawada tdp leader bonda uma to bid goodbye to chandrababu

Bonda Uma, TDP, YSRCP, Vijayawada central, ChandraBabu, YS Jagan, Malladi Vishnu, Andhra Pradesh, Politics

There is huge speculations running inside and outside the Telugu Desam party that another leader is all set to bid goodbye to Chandra Babu. The leader is none other than the former Vijayawada MLA Bonda Uma.

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న బొండా ఉమ.?

Posted: 08/01/2019 04:48 PM IST
Vijayawada tdp leader bonda uma to bid goodbye to chandrababu

ఐధేళ్ల పాటు అధికారంలో వున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా.. లేక ఓటమిని చవిచూసినా.. అప్పటి వరకు తాము చేపట్టిన అధికార, అనధికార పనులను సక్రమంగా పూర్తి చేసుకోవాలంటే గోపీలుగా మారాల్సిందే. ఇది రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య, అదే విధానాన్ని తాజాగా అన్వయించనున్నారు టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, అలియాస్ ఉమామహేశ్వరరావు.

టీడీపీలో ముఖ్యభూమిక పోషించిన ఆయనకు సీనియారిటీ లేనికారణంగా కొద్దిలో మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి మిస్ అయ్యింది కానీ, లేని పక్షంలో ఆయన టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారని మనం చెప్పుకునేవాళ్లం. అలాంటి బోండా ఉమ టీడీపీ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారా? ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థ పుచ్చుకోనున్నారని విజయవాడలో ప్రచారం జోరందుకుంది.

విజయవాడ సెంట్రల్ సీటు నుంచి టీడీపీ నుంచి బరిలోకి దిగిన ఆయన వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే బొండా ఉమా తమ పార్టీలోకి వస్తే విజయవాడ సెంట్రల్ కు బదులుగా తూర్పు నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తామని వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో కొనసాగుతూ అప్పటి వరకు తన అనధికార పనులను కూడా అధికార దన్నుతో చక్కబెట్టుకోవచ్చునని బొండా కూడా ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం.

అయితే తూర్పు సెగ్మెంట్ లో వున్న అసలు కిటుకుపైనే ఆయన తీవ్రంగా అలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పనిచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికలకు ముందు ఇదే నియోజకవర్గానికి ఇన్ చార్జీగా వ్యవహరించిన యలమంచిలి రవి తదితరులు సీనియర్లు కావడంతో తనకు వారి నుంచి సహకారం ఉండకపోవచ్చని బోండా ఉమ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోండా ఉమ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఐదో తేదీన ఆయన తిరిగి విజయవాడ రానున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరిక విషయమై నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bonda Uma  TDP  YSRCP  Vijayawada central  ChandraBabu  Andhra Pradesh  Politics  

Other Articles