KTR chit chat with media on trs losing lok sabha seats జాతీయ రాజకీయాలపై కేటీఆర్ యూ-టార్న్..!

Ktr chit chat with media on trs losing parliament seats

KTR on siru caru padaharu, KTR on BJP win, KTR on Revanth win, KTR on TRS, Congress MLA to join TRS, Lok sabha Elections, defection of MLAs, Harish Rao, KCR, congress MLA defection into TRS, KTR, KCR, Telangana CM, Congress, Telangana, politics

TRS working president KT Rama Rao said that Prime Minister Narendra Modi wave has made to 4 BJP MPs win in Telangana.

జాతీయ రాజకీయాలపై కేటీఆర్ యూ-టార్న్..!

Posted: 05/28/2019 06:18 PM IST
Ktr chit chat with media on trs losing parliament seats

దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా యూ-టార్న్ తీసుకున్నారు. ఇలా యూ-టార్న్ తీసుకోవడం రాజకీయ నేతలకు పరిపాటేనా అన్ని సందేహాలకు తెరలేపుతూ తాజాగా వ్యాఖ్యాలు చేశారు కేటీఆర్. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ హవా కొనసాగినా.. తాము మాత్రం మంచి సీట్లే స్థాధించామని అన్నారు. ఎన్నికలకు ముందు సారు, కారు, పదహారు.. అంటూ ఈ మూడు పదాలనే అధికంగా వినియోగించిన ఆయన.. తమ పార్టీ గత సార్వత్రిక ఎన్నికలలో సాధించిన సీట్ల కన్నా తక్కువ సీట్లు సాధించిన విషయాన్ని ప్రజలకు చెప్పకుండా.. తమ పార్టీ తెలంగాణ వాసుల్లో మరింత ఆదరణ పోందిందని విశ్లేషించారు.

గత డిసెంబర్ నెలలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక్క శాతం ఓట్లు అధికంగా లభించాయని ఆయన తాజాగా విశ్లేషించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన ఆయన.. తమ పార్టీ అభ్యర్థుల ఓటమిని.. గొప్పగా చెప్పుకోవడం గమనార్హం. ప్రజాతీర్పుతో ముడివేసి హుందాగా అంగీకరించాల్సింది పరాజయాన్ని.. ఎన్నికలు ముగిసినా.. ప్రజాదరణ తమకే వుందని చెప్పడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓటమిని కూడా గోప్పగా చెప్పుకోవడం.. కేటీఆర్ ప్రత్యేకతగా మారిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  

లోక్ సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండింగ్ కనపడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదహారు స్థానాలను గెలుస్తామనుకున్నామని.. కానీ అంచనాలు తప్పాయని అన్నారు. తన సోదరి కవిత.. నిజామాబాదులో.. సీనియర్ నేత వినోద్ కరీంనగర్ లో దారుణ ఓటమికి గురయ్యారని చెప్పడం సబబు కాదని, అయితే వారి పరాజయాలను ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీల ఓటములతో ముడిపెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఇక కవిత ఓటమికి రైతులకు సంబంధమే లేదని అన్నారు. రాజకీయ కార్యకర్తలే నామినేషన్లు వేశారని అన్నారు. అక్కడ కాంగ్రెస్, బీజేపి రెండు లోపాయికారి ఒప్పందం కూడా పార్టీ ఓటమికి కారణమన్నారు.

కాగా, తాను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో కుంగిపోమని చెప్పుకోచ్చారు. అదే సమయంలో మల్కాజ్ గిరిలో మాత్రం రేవంత్ రెడ్డి వెంట్రుకవాసితో గెలిచాడని కేటీఆర్ దెప్పిపోడిచారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో వున్న 30 లక్షల ఓట్లలో రేవంత్ రెడ్డి గెలిచిన స్వల్ప మెజారిటీ గెలుపే కాదని అన్నారు. అయితే రమారమి అదే మోజారిటీతో గెలుపొందిన అభ్యర్థులది కూడా నైతిక విజయం కాదని కేటీఆర్ అంగీకరిస్తారా.? అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు మాకు స్పీడ్ బ్రేకర్ లాంటివని అన్నారు.

ఆదిలాబాద్ లో  బీజేపీ గెలుస్తుందని  ఆ పార్టీ నేతలే ఊహించలేదన్నారు. సిరిసిల్లలో బీజేపీ కి కార్యకర్తలు కూడా లేరని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని అన్నారు. అయితే ఆ ఓట్లు చూసి టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కేటీఆర్ సూచించారు. మోడీ హవాతోనే తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయాన్ని అందుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గత పర్యాయం ఇంతకు రెట్టింపు స్థాయిలో మోడీ మానియా వున్నా.. బీజేపి ఒక్క స్థానంతోనే ఎందుకు సరిపెట్టుకుందన్న విషయాన్ని చెప్పలేదు కేటీఆర్.

కాగా, కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో కానీ లేక ప్రధాని మోడీతో రాజ్యాంగపరమైన మైత్రి.. ప్రభుత్వపరమైన సంబంధాలు కోనసాగుతాయని అన్నారు. అయితే వ్యక్తిగతంగా తమకు మోడీతో ఎప్పుడూ స్నేహం లేదని అన్నారు. 16 స్థానాలు గెలిస్తే 116 స్థానాలను జతకలిపి ఫెడరల్ ఫ్రంట్ సత్తాను చాటుతామన్న కేటీఆర్.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపి సోంతంగా బలాన్ని సమకూర్చుకుందని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరం లేదని.. ఆయన అన్నారు. ఇక కేంద్రంతో అంశాల వారీగా సత్సంబంధాలు కొనసాగుతాయన్న ఆయన.. రాష్ట్ర సమస్యల విషయంలో ఎవరితో రాజీపడేది లేదని అన్నారు. ఇక హరీష్ రావును పక్కనబెట్టామన్న వాదన సరికాదన్న ఆయన సిద్దపేటలో తమ అభ్యర్థికి మోజారిటీ తగ్గిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  KCR  Telangana CM  BJP  Narendra Modi  Rahul Gandhi  Congress  Telangana  politics  

Other Articles