kishan reddy to be picked-up for union cabinet berth కిషన్ రెడ్డికి.. బండారు స్థానమేనా.? లేక పదవి కూడానా.?

Kishan reddy to be picked up for union cabinet berth

Kishan Reddy, Bandaru Dattareya, secundrabad parliamentaty constituency, Union Minister, Cabinet Berth, Union cabinet, PM Modi, amit shah, Telangana, politics

Telangana BJP former President G.Kishan Reddy who had been won from Secundrabad parliamentaty constituency will be picked-up for new cabinet berth, rumours doing rounds in political circles.

కిషన్ రెడ్డికి.. బండారు స్థానమేనా.? లేక పదవి కూడానా.?

Posted: 05/24/2019 10:01 PM IST
Kishan reddy to be picked up for union cabinet berth

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇస్తూ ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఇక రానున్న రోజుల్లో తెలంగాణపై పూర్తిస్థాయిలో తమ ఆధిపత్యాన్ని కనబర్చేందుకు కూడా రెడీ అవుతున్నామన్న సంకేతాలను ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని అమిత్ షా నేతృత్వంతో పాటు రాష్ట్రంలోని లక్ష్మణ్ నాయకత్వాన్ని కూడా పార్టీ నేతలు శ్లాఘిస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలను ఇచ్చిన షాక్ నేపథ్యంలో మొక్కవోని ధైర్యంతో పనిచేసిన బీజేపి అధికార టీఆర్ఎస్ ను ఖంగుతినిపించింది.

ఈ క్రమంలో బీజేపి తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో నిలిచిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపోందిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని తనకు కేటాయిస్తారని ఆశించి భంగపడ్డ మాజీ కేంద్రం మంత్రి బండారు దత్తాత్రేయ.. కిషన్ రెడ్డి కోసం కూడా చమటోడ్చారు. ఆయన గెలుపు తనదిగా భావించారు. సోషల్ మీడియాను చక్కగా వినియోగించుకుని.. అధికార టీఆరఎస్ అభ్యర్థి తలసాని సాయిపై వున్న నేరచరిత్రను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి.. నల్లేరుపై నడక అనుకున్న విజయాన్ని ఆమడదూరం నుంచే లాక్కున్నారు.

ఇక కిషన్ రెడ్డితో పాటు నిజామాబాద్ లో బీజేపి బావుటాను ఎగురవేసిన ధర్మపూరి అరవింద్ విజయం కూడా ప్రాధాన్యత సంతచరించుకున్నదే. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరాజయాన్ని ఎవరూ ఊహించలేదు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత దారుణ పరాజయం పాలయ్యారు. పసుపు బోర్డు, ఎర్రజోన్న రైతులు అమెకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలవడమే కాకుండా.. అమె విజయం కోసం మండవ గడపను కూడా ముఖ్యమంత్రి ఎక్కారు. అటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీని కూడా తమ పార్టీలోకి అహ్వానించారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అమె పరాజయాన్ని మాత్రం అపలేకపోయారు.

వీరితో పాటు కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావులు కూడా గెలుపొందారు. ఈ నలుగురిలో సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి.. బీజేపి పార్టీకి మధ్య ఉన్న సెంటిమెంటుతో కిషన్ రెడ్డికి ఈ సారి మంత్రి పదవి దక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ లో బీజేపి ఎంపీ గెలిచి.. కేంద్రంలో బీజేపి పార్టీ అధికారంలో వుంటే తప్పక మంత్రిపదవి లభిస్తుందన్నదే సెంటిమెంటు. ఇది అటల్ బిహారీ వాజ్ పాయ్ హాయం నుంచి కొనసాగుతుంది. దీంతో తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌ ఇక కేంద్రమంత్రి కావడం ఖాయమని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles