ఐదు రాష్ట్రాలలో గెలుపెవరిదీ..? లెక్కింపుపైనే ఉత్కంఠ.. nation awaits for results of five states assembly elections

Nation awaits for results of five states assembly elections

Uttar pradesh polls, UP assembly elections, manipur assembly polls, punjab, goa, uttarkhand, five state assembly elections, Akhilesh Yadav, Uttar Pradesh, Samajwadi Party, BJP, congress, shiromani akalidal, politics

As the elctions of five states including uttar pradesh has been completed, nation awaits for results, which are to be counted on march 11.

ఐదు రాష్ట్రాలలో గెలుపెవరిదీ..? లెక్కింపుపైనే ఉత్కంఠ..

Posted: 03/08/2017 05:59 PM IST
Nation awaits for results of five states assembly elections

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి.. అవినీతి, నల్లధనాన్ని దేశం నుంచి తరిమేసేందుకు పాత పెద్దనోట్ల రద్దును చేపట్టిన తరువాత వచ్చిన ఎన్నికలు కవాడంతో.. ఈ ఎన్నికలు ఫలితాలు ఎలా వుండబోతున్నాయన్నది ఇటు దేశంలోనే కాదు.. అటు విదేశాలు కూడా అసక్తిని కనబరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత పెద్ద రాష్ట్రం, అత్యధిక అసెంబ్లీ స్థానాలకు నెలవైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తర ప్రదేశ్ పై ఎవరు పట్టుసాధిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

యూపీలో అధికార సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ కలసి పోటీ చేయగా, గత సార్వత్రిక ఎన్నికలలో దాదాపుగా 73 పార్లమెంటరీ నియోజకవర్గాలను గెలుచుకుని మంచి జోష్ మీదనున్న బీజేపితో పాటుగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకు మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో తమదే విజయం.. అంటూ అన్ని పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల ర్యాలీలు, సభల్లోనే బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందని, అలా కాని పక్షంలో కనీసం నాలుగింట మూడంతుల మెజారిటీ వస్తుందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు కూడా తమకే ప్రజలు అధికార పగ్గాలను అందిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అధికార అఖిలేష్ మాత్రం కాంగ్రెస్ యువనేత రాహుల్ తో జత కలిసిన తరువాత యువనాయకుల జోడీ. యూపీ అభివృద్దికి 'సరిజోడని అన్నారు. 

ఈ విషయాన్ని యూపీవాసులు విశ్వసిస్తున్నారని, అందుకే మరోమారు అధికార పగ్గాలు తమకేనంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే విజేతలు ఎవరన్నది మాత్రం తేల్చనుంది ఈవీఎం మిషన్లలో దాగిన ఓటరు తీర్పే. ఈ ఈవీఎం మెషిన్లను తెరచి ఓటరు ఏ విధమైన తీర్పునిచ్చాడన్న విషయం తెలియాలంటే మరో రెండు రోజులు వేచివుండక తప్పదు. మార్చి 11న ఐదు రాష్ట్రాల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అందుకోసం కేంద్ర ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లను చేస్తుంది.

పాత పెద్దనోట్ల రద్దు చేసిన తరుణంలో వచ్చిన ఎన్నికలలో బీజేపి నిజంగానే పట్టు సాధిస్తే.. ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు ఉన్నట్లేనని.. అలా కాని పక్షంలో ఈ ఎన్నికల ఫలితాలు తారుమారు అయితే మాత్రం కేంద్రం పాతనోట్ల నిర్ణయాలు, బ్యాంకుల లావాదేవీల నిబంధనల విషయంలో కొద్దిగా సడలింపులు చేసే అవకాశం వుండవచ్చునని కూడా తెలుస్తుంది. కాగా, యూపీలో బీజేపికి భంగపాటు తప్పదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గంలోనే బీజేపి అభ్యర్థుల గెలుపు కష్టమని, కేవలం మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆయన ఉనికి చాటుకునే అవకాశం వుందని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అయితే ఇది ప్రధాని మోడీ పాలనకు, ఆయన ప్రభుత్వ నిర్ణయాలకు రెఫరండంలా మాత్రం పరిగణించలేమని బీజేపి నేతలు చెప్పడం కొంత అనుమానాలకు తావిస్తుంది.

ఇక ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఫలితాలను పక్కనబెడితే.. పంజాబ్ లో కూడా బీజేపి దాని మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ పార్టీలకు భంగపాటు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. పంజాబ్ లోని అనేక ప్రాంతాల్లో త్రిముఖ పోటీ వున్నట్లు కనిపించినా.. అక్కడ మాత్రం కేవలం కాంగ్రెస్, కొత్తగా రాష్ట్రంలోకి అడుగుపెట్టిన అమ్ ఆద్మీ పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకోందని సమాచారం. ఇక గోవా రాష్ట్రానికి వస్తు అక్కడ చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధాన పోటీ మాత్రం అధికార బీజేపి, కాంగ్రెస్, అప్ పార్టీల మధ్యనే నెలకొంది. మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపి పార్టీలతో పాటు కొత్తగా ఇయాం షర్మిల పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలువగా, ఎవరు పైచేయి సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే. ఇటు ఉత్తరాఖండ్ లో అధికార కాంగ్రెస్ గెలుస్తుందా..? లేక ప్రతిపక్ష బీజేపి ఫీఠాన్ని హస్తగతం చేసుకుంటుందా అన్న విషయం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : five state assembly elections  uttar pradesh  punjab  goa  uttarakhand  manipur  

Other Articles