Arun Jaitley passes away at 66 బీజేపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూత

Veteran bjp leader arun jaitley passes away after prolonged illness

AIIMS, All India Institute of Medical Sciences, arun jaitley, Arun Jaitley Dead, Arun Jaitley News, Arun Jaitley latest news, Arun Jaitley died, Arun Jaitley passed away, Arun Jaitley ka nidhan, Arun Jaitley passed away today, jitendra singh, Narendra Modi, rajnath singh, smriti irani, Trivendra Singh Rawat, Uma Bharti

Arun Jaitley, the former finance minister and a stalwart of the BJP, passed away on Saturday at 66 years. Arun Jaitley was unwell for a large part of the last two years. In 2018, Arun Jaitley underwent a kidney transplant surgery, following which he was put under isolation.

ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన అరుణ్ జైట్లీ.. విషాదంలో బీజేపి నేతలు

Posted: 08/24/2019 12:24 PM IST
Veteran bjp leader arun jaitley passes away after prolonged illness

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం బారినపడిన ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి నుంచి మరింత విషమించడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినా వారి ప్రయత్నాలు విఫలమై ఆయన కన్నుమూశారు. శ్వాసకోస వ్యాధితో భాధపడుతున్న ఆయన ఈ నెల 9న ఎయిమ్స్ అసుపత్రిలో చేరారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ అస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్తతో బేజేపి శ్రేణులు విషాదంలో మునిగారు. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది.

అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించింది. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని తెలిపింది. ఆయన చేరినప్పటి నుంచి నిలకడగా వుంటూ వైద్యుల చికిత్సలకు సహకిరిస్తున్న ఆయన శరీరం ఈ నెల 16న ఒక్కసారిగా విషమించింది. వైద్యుల చికిత్సతో కొలుకున్న ఆయన గత రాత్రి నుంచి మళ్లీ తీవ్ర అనారోగ్యం బారిన ఇవాళ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ అసుపత్రివర్గాలు తెలిపాయి.

ఆగస్టు 9 నుంచి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అస్పత్రిలోనే చికిత్స పోందుతున్నా.. ఆయన ఆరోగ్యంపై మాత్రం ఇప్పటి వరకు అసుపత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన మరణించిన విషయాన్ని మాత్రం ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ జైట్లీ గతేడాది కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను కూడా చేయించుకున్నారు. అంతకుముందు 2014లో అరుణ్ జైట్లీ తన బరువును తగ్గించుకునేందుకు కూడా శస్త్రచికిత్సను చేయించుకున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ హయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన నాలుగుపర్యాయాలు విజయవంతంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఏడాది అనారోగ్యం కారణంగా ఆయన బడ్జెట్ ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయారు. దీంతో జైట్లీ స్నేహితుడు, సహచర మంత్రి పీయూష్ గోయల్ అప్పట్లో బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలకు ఆయన దూరంగా వున్నారు. తన అనారోగ్యం నేపథ్యంలో తాను పోటీ చేయలేనని ఆయన ప్రధాని మోడీకి, బీజేపి అధ్యక్షుడు అమిత్ షాలకు విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIIMS  arun jaitley  LK Advani  PM Modi  Amit Shah  BJP  New Delhi  Politics  

Other Articles