AP High Court Cancels Polavaram Re-Tenders ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు.. నవయుగకే పట్టం..

Ap high court orders stay on fresh tenders on polavaram hydel works

polavaram project, polavaram hydel project, polavaram head tank works, hydel power project works at polavaram, andhra pradesh high court, navayuga engineering company, jagan mohan reddy, YSRCP, chandrababu, TDP, andhra pradesh, Politics

In a setback for the Y S Jagan Mohan Reddy government, the Andhra Pradesh High Court stayed the re-tendering process for awarding works related to the execution of Polavaram Project hydel project.

ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు.. నవయుగకే పట్టం..

Posted: 08/22/2019 02:58 PM IST
Ap high court orders stay on fresh tenders on polavaram hydel works

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ప్రభుత్వాధినేత అప్పుడే విమర్శల పర్వాన్ని చవిచూస్తున్న క్రమంలో.. హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ప్రభుత్వం తీసుకున్న పోలవరం పనుల రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనుల ఒప్పందాన్ని ఏపీజెన్‌కో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. హైడల్ ప్రాజెక్టు విషయంలో మధ్యంతర ఉత్తర్వులను వెలువరించిన హైకోర్టు.. రివర్స్ టెండరింగ్‌పై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది.

జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులను ఇతరులకు అప్పగించకుండా నిలువరించాలని, తమనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. హైడల్ ప్రాజెక్టు టెండర్ రద్దు విషయంలో ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. రివర్స్ టెండరింగ్ విషయంలో ముందుకెళ్లరాదని స్పష్టంచేసింది. నవయుగ కాంట్రాక్ట‌ను రద్దుచేస్తూ ఏపీజెన్‌కో ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. నిబంధనల ప్రకారం వేగంగా పనులు చేస్తున్న తమని తప్పించి రివర్స్ టెండరింగ్ కు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వెళ్తోందంటూ పిటిషన్ దాఖలు చేసింది.

జెన్‌కోతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి.. కాంట్రాక్ట్ విషయంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని నవయుగ తరఫున వాదనలు వినిపించిన లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైడల్ ప్రాజెక్ట్ కు ఏపీ జెన్‌కో సకాలంలో స్ధలం చూపించనందుకే ఆలస్యమైనందని తెలిపారు. ఎలాంటి కారణం చూపకుండా ప్రభుత్వం ప్రాజెక్ట్‌కు సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘించలేదని.. 2021 నవంబరు వరకు తమకు కాంట్రాక్ట్ గడువు ఉందని తెలిపారు.

హైడల్ ప్రాజెక్టు విషయంలో మాత్రమే కోర్టు తీర్పు వెలువరించడంతో పోలవరం హెడ్‌వర్క్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో హెడ్ వర్క్స్ విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా, పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం మొత్తం రూ.4,900 కోట్ల మేర టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించిన ప్రభుత్వం.. హెడ్‌వర్క్స్ రూ.1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు రూ.3,100 కోట్ల పనులకు రివర్స్ టెండరింగ్‌ను ఆహ్వానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : polavaram project  AP High Court  navayuga engineering company  andhra pradesh  Politics  

Other Articles