Vietnam Vietjet Bikini Airlines Flight From Delhi బికిని ఎయిర్ లైన్స్ గోల్డన్ డేస్ ఆఫర్.. రూ 9కే టికెట్

Vietnamese bikini airline comes to india from december ticket prices from rs 9

bikini airline, delhi, india, Ho Chi Minh, vietnam, golden days, VietJet, Nguyen Thanh Son, business

A vietnam-based airline VietJet has confirmed that it will start the flight operations to india from December. The services will start from December 6 and the flight will be between delhi to Ho Chi Minh City.

భారత్ లోకి బికిని ఎయిర్ లైన్స్.. 22 వరకు గోల్డన్ డేస్ ఆఫర్..

Posted: 08/21/2019 04:37 PM IST
Vietnamese bikini airline comes to india from december ticket prices from rs 9

భారత దేశ నుంచి మరో దేశం తమ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. వియత్నాంకు చెందిన వియత్ జట్ ఎయిర్ లైన్స్.. ఇండియా నుంచి తమ దేశంలోని ముఖ్యనగరమైన హో చి మిన్హ్ కు విమాన సర్వీసులను ప్రారంభించనుంది. అన్నట్లు చెప్పనే లేదు కూదూ.. ఈ వియత్ జెట్ ఎయిర్ లైన్స్ నే బికినీ ఎయిర్ లైన్స్.. అని కూడా పిలుస్తారు. ఇదేం పేరని విస్తుపోకండీ.. ఈ విమానయానంలోని ప్యాసెంజర్లకు అందించే ప్రమోషనల్ కార్యక్రమాలతో వియత్ జెట్ ఎయిర్ లైన్స్ ఈ నామకరణాన్ని సంతరించుకుంది.

వియత్ జెట్ విమానయాన సంస్థ వియత్నాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజాగా భారత్ నుంచి కూడా తమ కార్యకలాపాలను సాగించాలని వియత్ జెట్ సన్నాహాలను పూర్తి చేసింది. ఈ ఎయిర్‌లైన్స్ ఈ ఏడాది డిసెంబర్‌ 6 నుంచి సేవలు ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది. తొలి ఫ్లైట్ ఢిల్లీ నుంచి వియత్నాం ప్రయాణించనుంది. ప్రయాణ సమయం 5 గంటలు పట్టొచ్చు. ప్రతి రోజూ విమానాలు నడుపుతామని కంపెనీ తెలిపింది. ఇక కంపెనీ కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.

ఇవాళ్టి నుంచి అంటే (ఆగస్ట్ 20 నుంచి) ఈనెల 22 వరకు గోల్డన్ డేస్ ఆఫర్ ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో వియత్ జెట్ విమాన టికెట్లను కొన్నవారికి కేవలం రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు పొందొంచ్చని కంపెనీ తెలిపింది. ఇది కేవలం బేస్ ఫేర్ మాత్రమే. అంటే ఇతర పన్నులు అదనం. అన్నీ కలుపుకుంటే టికెట్ కొనుగోలు చేయాలంటే ప్రారంభ ధర రూ.8,863గా ఉంది. వియత్ ఎయిర్‌లైన్స్ ప్రతి ఏడాది క్యాలెంటర్ ను విడుదల చేస్తుంది. ఇందులో బికినీ భామలు ఉంటారు. కంపెనీ ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్‌లోనూ వీరే ఎక్కువగా కనిపిస్తుంటారు. అందువల్ల ఈ ఎయిర్‌లైన్స్‌కు బికినీ ఎయిర్‌లైన్స్ అనే పేరుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bikini airline  delhi  india  Ho Chi Minh  vietnam  golden days  VietJet  Nguyen Thanh Son  business  

Other Articles